అందమైన చిత్రాల్లో అందని భావాలెన్నో..

అందమైన చిత్రాల్లో అందని భావాలెన్నో..
ఆమె చిత్రాలు చూస్తుంటే మహారణ్యంలో జాలువారే నీటిలో, కొండచెరియల్లో నుంచి కిందికి దూకే నీటిచినుకుల చెంత కలలు కంటూ సేదతీరుతున్న జీవితపు అనుభవాల దొంతర్లలో మునిగిపోయినట్లుగా అనిపిస్తాయి. ప్రకృతి ఒడిలో ఊయల ఊగుతున్నట్లుగా, రవివర్మ చిత్రాలకు సైతం అందని ఆమని కోయిల చెంత నిదురించే మనసుకు జోలపాట పాడినట్లుగా అనుభూతి స్వర్గంలో విహరిస్తున్నట్లుగా అనిపిస్తాయి. ప్రకృతిని చూసి ఆమె స్ఫూర్తిని పొందారో, లేక ప్రకృతే ఆమె చేతిలో ఒదిగిపోయిందో తెలియదు కానీ ఆమె చిత్రాలు చూసినవారికి మాత్రం ప్రకృతి చిత్రంగా మారి ఆ పేపర్‌పై కొలువ్ఞ తీరిందా అనిపిస్తుంది. ప్రింట్‌మేకింగ్‌లో ఎమ్ఎఫ్ఎ చేసి, తన ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసిన వేముల గౌరి అంటే తెలియని వారుండరు. ప్రింట్‌మేకింగ్… ఆడవాళ్లలో చాలా తక్కువ మంది ఈ సబ్జెక్టును ఎంచుకుంటారేమో. ఎందుకంటే ఇది చాలా కష్టమైన పని. ఇందులో దిట్ట వేముల గౌరి. ప్రింట్ మేకింగ్: నా డ్రాయింగ్స్లోని పర్ఫెక్షన్ చూసి లక్ష్మాగౌడ్ సార్ ఇది తీసుకోమని సూచించారు. జనరల్‌గా ఈ సబ్జెక్టును చాలా తక్కువ మంది ఎంచుకుంటారు.
ఎందుకంటే ప్రింట్ మేకింగ్ మాన్యువల్‌గా చేయాలి. ఇది చాలా కష్టం. ఇందులో ప్లేట్లని వాడతాము. అవి జింక్, కాపర్ ఇలా ఉంటాయి. ఈ జింక్ ప్లేట్‌ని బ్లాక్ చేసి ఏ ఏరియాస్ అయితే ఓపెన్ కావాలో దాన్ని స్క్రేప్ చేసి ఓపెన్ చేస్తారు. ఆ తరువాత దీన్ని నైట్రిక్ యాసిడ్‌లో వేసి టైమ్ చూసుకుంటూ, రేషియా ఆఫ్ యాసిడ్ విత్ వాటర్ మిక్స్ చేసి ఏరియాలను ఓపెన్ చేసుకుంటూ వెళ్లాలి. ఇలా వివిధ రకాల లేయర్స్, డిఫరెంట్ టెక్స్చర్స్, డిఫరెంట్ లైన్స్ క్రియేట్ చేసుకోవాలి. తరువాత దీన్ని వాష్ చేసుకుని ఇంక్ అప్లై చేసి అనవసరమైన చోట ఇంక్ తీసేయాలి. గ్రూస్లో ఎంత ఇంక్ ఉందో దానిపై వెట్ పేపర్ పెట్టి ప్రెజర్లో ప్రాసెస్ చేస్తే గ్రూస్లో ఉన్న ఇంక్ పేపర్‌పైకి వెళుతుంది. ఇలా చేసి ఎన్ని ప్రింట్లు తీయాలో ముందుగా దానిపై రాసుకుంటాము. ఇలా ప్రింట్ మేకింగ్ చేస్తారు. దీనిలో యాసిడ్ ఉపయోగించడం వల్ల ఇది చాలా ప్రమాదకరం. అంతేకాదు దీనిలో ఏ చిన్న తప్పు జరిగినా ప్రింట్ సరిగ్గా రాదు. దీని ఖరీదు కూడా తక్కువే. ప్లేట్ వేసిన తరువాత ఎవరైనా ప్రింట్లు తీయవచ్చు కదా అనుకుంటే పొరపాటే! తప్పని సరిగా ప్రింట్ తీసేవ్యక్తి కూడా ఆర్టిస్టే అయి ఉండాలి. ఇలా కాకుండా నార్మల్ డ్రాయింగ్స్ వేసుకోవచ్చు. ఇవి మార్కెట్లో ధర ఎక్కువ పలుకుతాయి. అయితే ఇది ఒకటి లక్ష రూపాయలు ఉంటే ఇదే డ్రాయింగ్ ప్లేట్‌పై వేసి ప్రింట్ తీస్తే దాని ఖరీదు ముప్పై వేలు ఉంటుంది. అయితే ఒకప్లేట్లో మనం ముప్పై ప్రింట్లు తీసుకోవచ్చు కాబట్టి ఒకొక్కటి ముప్పైవేల చొప్పున ముప్పై ప్రింట్లు… చాలా లాభం కదా. అయితే ఇందులో ప్రతి ప్రింట్ రికార్డెడ్‌గా ఉంటుంది. కొన్న ప్రతి ప్రింట్కు అథెంటిఫికేషన్ సర్టిఫికెట్ ఇస్తాం. ముప్పై ప్రింట్లు తీసిన తరువాత ప్లేట్‌ను క్రాస్ చేస్తారు. లేకపోతే అది ఇల్లీగల్ క్రైమ్ అవ్ఞతుంది. ఇలా ప్రింట్ మేకింగ్ జరుగుతుంది. ప్రస్తుతానికి డ్రాయింగ్ చేత్తోనే వేసుకుంటున్నాను. దీనికోసం రోలర్ ఇంక్ పెన్ వాడతాను. ఇందులో 0.1 నీడిల్‌ను ఉపయోగిస్తాను. కొంచెం థిక్‌గా కావాలనుకుంటే 0.4 నీడిల్‌ను ఉపయోగిస్తాను. ఇలా డ్రాయింగ్ ప్రాసెస్ కొనసాగుతోంది అన్నారు గౌరి.
కుటుంబ నేపధ్యం ఇది:
మేము మొత్తం ఆరుగురం. ఇద్దరు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలం. నాన్నగారు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. నా పదవతరగతి వరకు కర్ణాటకలో ఉన్నాం, తరువాత ఇక్కడికి వచ్చేశాం. మా ఇంట్లో అందరూ ఉద్యోగస్తులే. నేను స్కూల్లో చదువ్ఞతున్నప్పుడు మా స్కూల్లో అన్ని ఆక్టివిటీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. నేను ఆటల్లో ఎప్పుడూ ముందుండే దాన్ని. త్రోబాల్, వాలీబాల్‌లో మనమే ఫస్ట్. డిస్టెన్స్ రన్నింగ్ కూడా చేశాను. కానీ వాలీబాల్‌లో నేషనల్ చాంపియన్ని. అలాగే ఆర్ట్‌లో కూడా చాలా అవార్డులు వచ్చాయి. వాలీబాల్, ఆర్ట్‌లో చాలా అవార్డులను సొంతం చేసుకున్నాను. మరి వాలీబాల్‌ను కెరీర్‌గా ఎందుకు ఎంచుకోలేదు అని అడిగితే మా నాన్నగారు స్పోర్ట్స్‌లో ఆడపిల్లలు రాణించడం కష్టం. దానికితోడు ఎప్పుడూ నీకు తోడుగా ఇంకొకర్ని పంపించాలి. కష్టం కదా అని ఆర్ట్‌లో ఎంకరేజ్ చేశారు. అలా డ్రాయింగ్‌లో సెటిలయ్యాను. పదవతరగతి తరువాత రెండు సంవత్సరాలు డ్రాయింగ్ డిప్లొమా చేశాను. తరువాత జెఎన్‌టియులో బిఎఫ్ఎ చేసి, హైద్రాబాద్ యూనివర్శిటీలో ఎమ్ఎఫ్ఎ ప్రింట్ మేకింగ్ చేశాను. బిఎఫ్ఎ చేసేటప్పుడు ఆఖరి సంవత్సరంలో గ్రాఫిక్ డిజైనింగ్ సబ్జెక్టు ఒకటి ఉంటుంది. మేం కాంప్‌లో ఉన్నప్పుడు లినోనియమ్ షీట్స్‌పైన వర్క్ చేశాను. ఆ వర్క్స్ బాగా వచ్చాయి. వాటిని ఎమ్ఎఫ్ఎ పోర్ట్‌ఫోలియోలో పెట్టాను. స్కాలర్‌షిప్‌లతో కెరీర్లో ముందుకు ఇప్పటి వరకు నాకు నేషనల్ స్కాలర్షిప్, లలిత కళా అకాడమీ స్కాలర్షిప్, మెరిట్ స్కాలర్షిప్ ఇలా చాలా వచ్చాయి. మనం మన వర్క్స్‌ను ఎగ్జిబిట్ చేసేముందు చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేయాలి. నేను ఎమ్ఎఫ్ఎలో ఉన్నప్పుడు వేసిన డ్రాయింగ్స్‌తో నా బయోడేటా కలిపి పది ఆర్ట్ గ్యాలరీలకు పంపాను. అందులో ఆరు గ్యాలరీలనుంచి నాకు ఆహ్వానం అందింది. నేను వాటిలో రెండింటిని సెలక్ట్ చేసుకున్నాను. అలా నా ఆర్ట్‌ను, కెరీర్‌ను పెంచుకున్నాను. అయితే ఒక్కటి మాత్రం నిజం మంచి స్కూల్లో చదివితే మంచి భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుంది.