అందనివాటిపై ఆశవద్దు

CUTE
CUTE

అందనివాటిపై ఆశవద్దు

మనకు ఎదురయ్యే సంఘటనలు, మనం ఊహించుకునే ఆలోచనలు మొదలైనవన్నీ మనపై ప్రభావం చూపుతాయి. వాస్తవాలను గుర్తించి దానికి అనుగుణంగా ప్రవర్తించడం, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మన లక్ష్యాలను నిర్ణయించుకోవడం అవసరం. వాస్తవాలను అంచనావేయడంలో పొరపాటు జరిగితే లక్ష్య సాధనలో వైఫల్యాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఒక కార్యాన్ని సాధించాలనుకునే వారు వాస్తవాలను వదిలి, కలలతో, ఊహాలోకంలో విహరిస్తూ తమ కార్యసాధనకు అంతరా యం కలిగించుకోరు. ఊహాలోకంలో విహరిస్తూ, భవిష్యత్తును కూడా ఊహలకే పరిమితం చేసుకునేవారు ఆ సమయంలో తాత్కాలికంగా ఆనందంగా గడుపగలుగతారేమో కాని, వాస్తవ జీవితంలో మాత్రం అందుకు భిన్నంగా జీవిస్తారు. ఈ రకమైన వ్యక్తిత్వం కలిగిన వారికి సమయం వృధాకావడమే తప్ప మరేవిధమైన ఉపయోగమూ ఉండదు. మరొక రకపు వ్యక్తిత్వ మున్న వారు కూడా మనకు కనిపిస్తుంటారు. వీరు పూర్తిగా అవాస్తవిక భావాలతో జీవిస్తుంటారు. అపనమ్మకం, అవిశ్వాసం వంటి లక్షణాలు కలగడానికి కారణం అజ్ఞానం, అవగాహనారాహిత్యం. తాము చేసే పనిపై అవగాహన లేకపోతే సరైన పద్ధతిలో లక్ష్యసాధన దిశగా ప్రయాణించలేరు. ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థంకాని స్థితిలో కొట్టుమిట్టాడు తారు. పలితంగా ఇటువంటి వారికి తమపై తమకే నమ్మకం తగ్గుతుంది. తాము ఎందుకూ కొరగానివారమనే అభిప్రాయంతో వారిలో ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది. ఆత్మవిశ్వాసం లేకపోతే ధైర్యం తగ్గిపోతుంది. ఏ పనినైనా చేయగలమో లేదోననే భయం వెన్నాడుతుంటుంది. ఒకవేళ ఏదైనా పని ఆరంభించినా, తగిన ఫలితం రాదేమో అనే సందేహం కలుగుతుంది. దీని కారణంగా అసహనమేర్పడుతుంది. నిలకడగా పని చేయలేరు. మనల్ని మనం విశ్వసించలేని స్థితి కలుగుతుంది. ఇదే ఆత్మన్యూనతాభావానికి దారి తీస్తుంది. ఆత్మన్యూనతాభావానికి గురైన వ్యక్తులు తమను తాము విశ్వసించుకోలేరు. వారిపైన వారికే సరైన అవగాహన ఉండదు. దేనినీ సానుకూల దృక్పథంతో చూడలేరు. వీరికి ప్రతి అంశమూ వ్యతిరేకంగానే కనిపిస్తాయి. వీరిలో ప్రబలిపోయే ఈ నెగటివ్‌ ధోరణి కారణంగా ప్రతి పనిలోనూ ప్రతికూల ఫలితాలే కనిపిస్తాయి. ఆత్మన్యూనత కలిగిన వ్యక్తులు ఏ పనినీ చేయలేరు. అసలు చేయాలని అనుకోరు కూడా. దీనికి ప్రధాన కారణం ఆ పని తాము చేయలేమేమోననే భావన. ఒకవేళ చేసినా సత్ఫలితాలు రావేమోననే భయం. తాము చేయాలనుకున్న పనిని మొదలెట్టినా, సరైన అవగాహన లేనందువల్ల ఆ పని సక్రమంగా చేయలేకపోతారు. దీనితో సత్ఫలితాలు లభించవ్ఞ. దీనితో తాము చేతగానివాళ్లమనే అభిప్రాయం వారిలో మరింతగా స్థిరపడు తుంది. ఆత్మన్యూనత కలిగిన వ్యక్తులు తమకు ఎదురయ్యే ఏ సమస్యనూ పరిష్కరించుకోలేని స్థితిలో ఉంటారు. ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో చూస్తూ ఆందోళన చెందుతారు. ప్రణాళి కాబద్ధంగా వ్యవహరించలేరు. ప్రతి విషయంలోనూ వారిలోని నెగటివ్‌ ఆలోచనా దృక్పథమే ముందుకు వస్తుంది. తాము వైఫల్యం చెందినప్పుడు విచారించడమే కాకుండా, ఎదుటి వారు విజయం సాధించినప్పుడు కూడా తమనే నిందించుకుంటారు. ఏదేని లక్ష్యాన్ని సాధించాలనుకునే వ్యక్తులు ముందుగా తమను తాము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తమ శక్తి సామర్థ్యాలను బేరీజు వేసుకోవాలి. అవసరానుగుణంగా వాటికి మరింత పదును పెట్టుకోవాలి. ఆత్మన్యూనతతో బాధపడేవారు ఆత్మన్యూనతనుంచి బైటపడటానికి ఏం చేయాలో తెలుసుకోవాలి. తమ వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుకోవాలి. నలుగురితో కలిసిమెలిసి జీవించాలి. ఎదుటివారి విజయాలకు కారణమేమిటి? తాము ఎక్కడ పొరపాటు చేస్తున్నామనే అంశాన్ని గ్రహించగలగాలి. చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించగలగాలి. అపజయాలు విజయానికి సోపానాలని గుర్తించి, గతంలో చేసిన పొరపాట్లను విడనాడి, విజయం వైపుగా పయనించాలి. ఇలాంటివన్నీ ఆత్మ విశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. ఆత్మవిశ్వాసం పెరిగితే లక్ష్య సాధన కూడా సులభమవ్ఞతుంది. ======= గాడి తప్పుతున్న వివాహ వ్యవస్థ స్త్రీపురుషులు ఇరువ్ఞలు సంపాదనే లక్ష్యంగా వెంపర్లాడటం, కుటుంబానికి, భాగస్వామికి కావలసినంత సమయం కేటాయించకపోవడంతో తీయని మాటలు చెప్పేవారికి దగ్గరయ్యి వివాహేతర సంబంధాలకు తెరలేపుతున్నారు. సోషల్‌ మీడియా ప్రభావం: స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరలకే అందుబాటులోకి రావడం, ఇంట్లో కుటుంబసభ్యులు ఎందరు ఉంటే వారందరు, స్మార్ట్‌ఫోన్లు వాడటం, మానవ సంబంధాల కంటే ఎక్కువగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, టెలిగ్రామ్‌ లాంటి సోషల్‌ మీడియాకే ప్రాధాన్యతను ఇస్తున్నారు. గాడితప్పుతున్న వివాహవ్యవస్థ ఇటీవల రోజురోజుకు వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. సాధారణంగా క్షిణికావేశంలో మొదలయ్యే వివాహేతర సంబంధాలు హంతకులుగా మారుస్తున్నాయి. వివాహేతర సంబంధాలు దేశసంస్కృతికి, వివాహ వ్యవస్థకు మాయని మచ్చగా పేట్రేగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడమేనా! ఆధునిక టెక్నాలజీ మనిషి జీవన విధానానికి ఉపయోగపడటం కంటే వినాశానానికే దోహదం చేస్తుంది. స్త్రీపురుషులు ఇరువ్ఞలు సంపాదనే లక్ష్యంగా వెంపర్లాడటం, కుటుంబానికి, భాగస్వామికి కావలసినంత సమయం కేటాయించకపోవడంతో తీయని మాటలు చెప్పేవారికి దగ్గరయ్యి వివాహేతర సంబంధాలకు తెరలేపుతున్నారు. సోషల్‌ మీడియా ప్రభావం: స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరలకే అందుబాటులోకి రావడం, ఇంట్లో కుటుంబసభ్యులు ఎందరు ఉంటే వారందరు, స్మార్ట్‌ఫోన్లు వాడటం, మానవ సంబంధాల కంటే ఎక్కువగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, టెలిగ్రామ్‌ లాంటి సోషల్‌ మీడియాకే ప్రాధాన్యతను ఇవ్వడంతో మానవ సంబంధాలను మరుగున పడుతున్నాయి. సోషల్‌ మీడియా ద్వారా ఎవరెవరో ముక్కూమొహం తెలియనివారు కూడా స్నేహితులుగా పరిచయమవ్ఞతున్నారు. స్నేహంతో మొదలై పరిచయాలు పక్కదారిపడుతూ ఇంట్లో వ్ఞంటూనే రహస్యంగా చాటింగ్‌లు, మెసెజ్‌లు పంపించుకోవడం చేస్తున్నారు. మెసేజ్‌లతో మొదలయ్యే తీయటి మాటలతో వారి భాగస్వామి కంటే అమితంగా గౌరవిస్తున్నట్టు నటించి వారికి విడదీయలేనంత దగ్గరైపోతున్నారు. ఈ క్రమంలో వారితో కలిసి వ్ఞండేందుకు ఇవతలి వారు ఎంతకైనా సరేనంటూ తెగించేస్తున్నారు. ఎదుటివారిని వదిలి వ్ఞండలేని స్థితికి చేరిపోవడంతో రక్తసంబంధాలు, కుటుంబ కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలను సైతం తుంగలో తొక్కి హత్యలకు ఎగబాకుతున్నారు. వివాహేతర సంబంధాల వల్ల కలిగే అనర్థాలు, ఎదురయ్యే సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యతను ప్రభుత్వాలు సీరియస్‌గా చేపట్టాలి. సినిమాలు, సీరియళ్ల ప్రభావం: వివాహేతర సంబంధాలపై సినిమాలు, సీరియళ్లు తీవ్రంగా చూపుతోంది. గతంలో కట్టుబాట్లకు విలువనిచ్చే మహిళలు, పురుషులపై టివి సీరియళ్లు, సినిమాల ప్రభావం తీవ్రంగా పడడంతో అవి కనుమరుగైపోయాయి. వివాహేతర సంబంధాల మోజులో పడితమ భాగస్వాములను అంతమొందించేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి తమ కన్నపేగులను సైతం సమిధలుగా మార్చుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడో ఒకచోట భర్తను చంపిన భార్య..భార్యను చంపిన భర్త, అక్రమసంబంధానికి అడ్డుగా మారాడని పిల్లలను చంపిన భార్య, భర్త వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పోకడలు వివాహ వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా చెప్పుకోవాలి. ఆర్థిక స్వేచ్ఛను పొందిన మహిళలు నైతిక విలువలకు కట్టుబడి ఉండడం కూడా తమ బాధ్యతగా గుర్తించాలి. అలాగే భర్తలు కూడా భాగస్వామికి దూరంగా ఉన్న పరిస్థితుల్లో నమ్మకం అనే పునాదిపై సంసారాన్ని సాగించాలే తప్ప క్షిణికమైన సుఖాలకోసం కాపురాలను కూల్చుకోకూడదు.

– డాక్టర్‌ అట్ల శ్రీనివాస్‌రెడ్డి