అందం చూడు

                                          అందం చూడు

LADY
LADY

రోజూ పడుకునే ముందు స్వచ్ఛమైన ఆముదాన్ని రాసుకుంటే కనురెప్పలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇది కళ్లల్లోకి వెళ్లినా భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. అంతే. కొందరికి కనురెప్పల వెంట్రుకలు చిక్కగా ఉంటాయి. కాని స్కిన్‌ కలర్‌లో కలిసిపోయినట్లుంటాయి.

ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు కనురెప్పలకు మస్కారాతో నల్లగా కనిపించే విధంగా చేయవచ్చు. మస్కారా వాడినప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే బేబీ ఆయిల్‌ కాని ఆముదం కాని రాసి మస్కారాను పూర్తిగా తుడిచేయాలి. తలకు వేసే హెయిర్‌ డై ప్రత్యామ్నాయంగా ఎంచుకోకూడదు. ఎట్టి పరిస్థితులలోను హెయిర్‌డైను కళ్ల దగ్గరకు రానీయకూడదు.

కనురెప్పల వెంట్రుకలు నల్లగా పొడవ్ఞగా పెరగాలంటే మూడు టేబుల్‌స్పూన్ల కొబ్బరినూనెలో రెండు చుక్కల టీట్రీ ఆయిల్‌ కలిపి అప్లయ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని చాలా కొద్దిగా తీసుకుని కళ్లలోకి జారకుండా కనుబొమలకు మాత్రమే సరిపోయేటట్టు రాయాలి. రాత్రి పడుకునే ముందు రాస్తే మంచిది.

కనుబొమల వద్ద చర్మం పొడిబారి డాండ్రఫ్‌ వంటి సమస్య ఉన్నా కూడా కొబ్బరి నూనె, టీట్రీ ఆయిల్‌ రాస్తే నివారణ అవ్ఞతుంది.