‘అంత స‌త్తా ఉన్న‌ప్పుడు ఎందుకు ప్ర‌లోభ‌పెడుతున్నారు’: కోదండ‌రామ్

Kodandaram
Kodandaram

భ‌ద్రాద్రి కొత్త‌గూడెంః టీఆర్ఎస్ నేతలపై టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ మండిపడ్డారు. తెలంగాణలో తిరుగులేని పార్టీ టీఆర్ఎస్ అని చెప్పుకుంటున్న నేతలు… ప్రలోభాలకు ఎందుకు దిగుతున్నారని ఆయన ప్రశ్నించారు. నిజంగా టీఆర్ఎస్ కు అంత సత్తా ఉంటే సింగరేణి ఎన్నికల్లో డబ్బు, మద్యం, విందులతో ఎందుకు ప్రలోభపెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. సింగరేణి కార్మికులపై తమకు నమ్మకం ఉందని… తమకు ఓట్లు వేసి విజయాన్ని కట్టిబెడతారని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందనే విషయం సింగరేణి కార్మికులందరికీ తెలుసని కార్మికుల తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని అన్నారు.