అంత కోపమేల?

Angry
Angry

అంత కోపమేల?

ఉద్రేక తీవ్రత తగ్గించుకొనేందుకు అనేకమార్గాలు ఉన్నాయి. మనం ఎంచుకొనే మార్గాన్ని బట్టి మన కుటుంబ జీవితం, సహజ జీవితం సక్రమంగా సాగుతాయా అన్నది ఆధారపడి ఉంటుంది. అరవైఏళ్లు పైబడిన అచ్యుతశ్రీకి ఆవేశం వస్తే ఆరేళ్ల అమ్మాయిలా ప్రవరిస్తారు. అరచి గీపెడుతుంది.. అందిన వస్తువ్ఞలు విసిరి కొడుతుంది.

అడ్డువచ్చిన వాళ్లను తిడుతుంది. ఆ విధంగా అరగంట సేపు ఆర్భాటం చేశాక ఆయాసంతో అలసిపోయి, కుర్చీలో కూలబడిపోతుంది.. తన ఉద్రేకతాపాన్ని విముక్తం చేసుకొని ఉపశమనం పొందేందుకు ఆమె ఎంచుకొన్న అయోగ్యమార్గం ఇది. రాధకు ఎప్పుడు కోపం వస్తుందో ఎవరికీ తెలియదు. ఎవరితో గొడవపడి ఏ సమస్యతో ఇంటికి వస్తుందో అని ఇంట్లో వాళ్లకు ఎడతెగని భయం, ఆగ్రహానికి లోనైన క్షణం హస్త సామర్థ్యం చూపడం ఆమె నైజం.ఎరినో ఒకరిని కొట్టడం, కొట్టించుకోవడం, చిరిగిన బట్టలతో, చెదరిన జుట్టుతో ఇల్లు చేరి తన గదిలో ఏకాంతంగా కూర్చోవడం ఆమె నిత్యకృత్యం. ఆవేశ విసర్జనకు అతడెంచుకొన్న అవివేక పద్ధతి ఇది. అవంతి విధానం వేరు. కోపం వస్తే క్షణకాలం కళ్లు మూసుకుంటుంది. తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ తల అడ్డంగా ఆడిస్తాడు.

సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆవేశతీవ్రత తగ్గించుకొనేందుకు అతడు అనేక యోగ్యమైన మార్గాలు అనుస రిస్తుంది. పార్కులోకి వెళ్లి గంటసేపు నడచి రావడం లేక సోఫాలో కూర్చొ ని కాసేపు శాస్త్రీయ సంగీతం వినడం మంచి పుస్తకం తీసుకొని పఠ నంలో నిమగ్నం కావడం, ఇవి అవంతి అనుసరించే ప్రశంసనీయ పద్ధతులు.