అంత‌రిక్ష రాకెట్ కేంద్రంలో ‘జీరో’

SRK, ANUSHKA
SRK, ANUSHKA

ముంబైః బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నారు. ‘జీరో’ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాకి షారుక్ ఖాన్ ఒక నిర్మాత కాగా, ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కథా పరంగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను అమెరికాలోని ‘అలబామా’లోని అంతరిక్ష రాకెట్ కేంద్రంలో చిత్రీకరించనున్నారు. ముంబైలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లిన షారుక్, అక్కడి అధికారులతో చర్చించి అనుమతులను పొందారు. ఈ సినిమాలో అనుష్క శర్మ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా, స్టార్ హీరోయిన్ పాత్రలో కత్రినా కైఫ్ అలరించనుంది. షారుక్ మరుగుజ్జుగా షారుక్ కనిపించనుండటం విశేషం.