అంతా మన మంచికే..పాటలు రికార్డింగ్‌

Anthamanamanchike
ప్రముఖ దర్శకులు నగేష్‌ కుకునూర్‌, మణిశంకర్‌, రాజ్‌అండ్‌ డి కె వద్ద దశాబ్ద కాలంగా దర్శకత్వ శాఖలో పనిచేసి అనుభవం గడించిన యం.కె.షరీఫ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ లైట్‌ పిక్చర్స్‌ మరియు స్ప్రింగ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా అంతా మన మంచికే అనే క షీర్‌ ఎంటర్‌టైనర్‌ ఫిలింని నిర్మిస్తోంది. మహబూబ్‌ అలీ ఖాన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌ మీదకు రానుంది. ఆర్యన్‌ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ నటీ నటులతో పాటు కొత్త నటీనటులు కూడా నటించనున్నారు. జూలై మొదటివారంలో షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించి స్వరసంగీత దర్శకత్వంలో మొదటి పాటను రికార్డు చేయడం జరిగింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చక్కటి స్క్రిప్ట్‌ని దర్శకుడు రెడీ చేసారని, చక్కటి నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మిస్తున్నామని నిర్మాత మహబూబ్‌ అలీ ఖాన్‌ చెప్పారు. కాగా, ఈ చిత్రానికి పాటలు : లక్ష్మన్‌ గంగ, సంగీతం: స్వర, మాటలు: షేక్‌ యాకుబ్‌ అలీ, ఆర్ట్‌: భాస్కర్‌, కథ: యం.కె.షరీఫ్‌, ప్రొడ్యూసర్‌: మహబూబ్‌ అలీ ఖాన్‌, డైరెక్టర్‌: యం.కె.షరీఫ్‌