అంతా కాస్ట్‌లీగా…

Spider
Spider

అంతా కాస్ట్‌లీగా…

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న స్పైడర్‌ చిత్రం అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి..భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతునన ఈచిత్రం ఈ వేసవిలోనే విడుదల కావాల్సి ఉంది.. కానీ అనుకోని కారణాల వల్ల దసరాకు వాయిదా పడింది.. చిత్ర దర్శకుడు మురుగదాస్‌ మీడియాతో మాట్లాడారు.. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న స్పైడర్‌ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతున్నందువల్లనే ఆలస్యం జరుగుతోందని వివరించారు.. అయినా కూడ స్పైడర్‌ అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చిందని మురుగదాస్‌ తెలిపారు.. మురుగదాస్‌ మాటలు మహేష్‌ అభిమానులకు ఉత్సాహాన్ని పెంచుతాయనటంలో సందేహం లేదు.. కాగా స్పైడర్‌చిత్రం త్వరలో పూర్తికానుంది..