అంతర్జాతీయ మార్కెట్లు, నైరుతి పవనాలే దిక్సూచి

SENSEX1
SENSEX

అంతర్జాతీయ మార్కెట్లు, నైరుతి పవనాలే దిక్సూచి

ముంబయి, ఆగస్టు 21: అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, భౌగోళిక స్థితిగతులు, నైరుతి కదలిక లు వచ్చేవారం మార్కెట్లకు దిక్సూచి అవుతాయని అంచనా. కంపెనీల త్రైమాసిక ఫలితాల సీజన్‌ ముగింపుస్థితికి చేరిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎక్కువగా విదేశీ అంశాలకే ప్రాధాన్యతనిస్తారు. గత వారం మొత్తం ఉత్తరకొరియా, అమెరికామధ్య తలెత్తిన యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి.

వారం చివరిలో యుద్ధమేఘాలు తొలగినప్పటికీ సిఇఒల రాజీనామాలతో అమెరికా ప్రెసిడెంట్‌ట్రంప్‌ రెండు వ్యూహాత్మక బిజినెస్‌ సలహా మండళ్లను రద్దుచేయడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. వీటికితోడు ఆశించిన స్థాయిలో ద్రవ్యోల్బణం బలపడక పోవడం వల్ల ఫెడ్‌ రిజర్వు కమిటీ వడ్డీరేట్ల పెంపునకు వెనుకంజ వేస్తోం ది. దీనితో అమెరికా యూరప్‌, ఆసియా మార్కెట్లు బలహీనం అయ్యాయి. గణేశ్‌చతుర్ధి సందర్భంగా వచ్చే శుక్రవారం స్టాక్‌మార్కెట్లకు సెలవు ఉంటుంది.

వచ్చేవారం ట్రేడింగ్‌ నాలుగురోజులకే పరిమితం కానుంది. వచ్చేవారం రేటింగ్స్‌సంస్త కేర్‌, క్యాస్ట్రాల్‌ ఇండియా, పిఅండ్‌జి, జిల్లెట్‌ ఇండియా త్రైమాసిక ఫలితాలు వెల్లడిస్తాయి. ఈనెల 16కల్లా దేశవ్యాప్తంగా వర్షపాతం దీర్ఘకాలిక సాధారణ సగటుకంటే నాలుగుశాతం తక్కువ నమోదయినట్లు వాతావరణశాఖ తాజాగా వెల్లడించింది. దీనితో ఇకపై రుతు పవనాల విస్తరణ సెంటిమెంట్‌కు కీలకంగా నిలుస్తోంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులు, డాలర్‌ రూపాయి మారకం విలువలు,ముడిచమురుధరలు వంటి అంశాలకుసైతం ప్రాధాన్యత లేకపో లేదు. ఇన్ఫోసిస్‌ సిఇఒ విశాల్‌సిక్కా హటాత్తుగా తన పదవికి రాజీనామా చేయడంతో శుక్రవారం మార్కె ట్లు పతనంఅయ్యాయి. ఇన్ఫోసిస్‌ బోర్డుశనివారం నాటి కీలక సమావేశంలో బైబాక్‌నిర్ణయాలను ప్రకటిం చనున్నది. ఈప్రభావంఅటు మార్కెట్లపైనా, ఇన్ఫోసిస్‌కౌంటర్‌పైనా ప్రతిఫలిస్తుందని నిపుణుల అంచనా.