అంతగా వాడకండి..

                              అంతగా వాడకండి..

SAD
SAD

మానవ శరీరానికి ఏర్పడే సమస్యలు నొప్పి రూపంతో కనిపిస్తాయి. ఈ నొప్పులను రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి సమస్యతో ఏర్పడే నొప్పులు, సమస్య లేకుండానే ఏర్పడే నొప్పులు, సమస్య వలన ఏర్పడే నొప్పులను నోసిసెప్టిన్‌ పెయిన్స్‌ అని, ఎటువంటి సమస్య లేనప్పటికీ కనిపించే నొప్పులను న్యూరోపతి పెయిన్స్‌ అని అంటాము. శరీరంలో ఏర్పడిన సమస్య తగిన మందులు వాడితే నోసిసెప్టిన్‌ నొప్పులు తొలగి పోతాయి. ఇప్పుడు సమస్యంతా న్యూరోపతి పెయిన్స్‌తోనే. ఎందుకంటే ఈ రకం నొప్పులకు కారణాలు ఉండవ్ఞ. నరాలలో ఏర్పడే లోపాల వలన, ఆసాధారణ మార్పుల వలన ఈ రకం నొప్పులు ఏర్పడతాయి.

వీటికి పెయిన్‌కిల్లర్స్‌ వాడితే తాత్కాలికంగా ఉపశమనం కలిగినా మళ్లీ యధాతథంగా నొప్పి ఏర్పడుతుంది. తద్వారా కొందరు ఈ నొప్పులకు పెయిన్‌ కిల్లర్స్‌ను తరచూ వాడుతూ వాటికి అలవాటు పడి, మరిన్ని సమస్యలను తెచ్చుకుంటారు. ఈ విధమైన కారణాలు తెలియని నొప్పి ఏర్పడే వారిలో కొంతమందికి పాదాల నుంచి పైకి పాకుతూ తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. దీన్ని ప్లాంటా ఫేసియైటిస్‌ అంటారు. ఇటువంటి నొప్పులకు కారణాలు తెలియవ్ఞ. ప్రత్యేక చికిత్సలు కూడా ఉండవ్ఞ. కొంతమందిలో చివరి వెన్నుపూస దగ్గర నొప్పి ఏర్పడుతుంది. ఏమాత్రం చిన్న దెబ్బతగిలినా, ఒత్తిడి ఏర్పడినా వారు నొప్పిని భరించలేరు.

ఈ బాధను తట్టుకోవడా నికి పెయిన్‌ కిల్లర్‌కు అలవాటుపడతారు. కేన్సర్‌బాధితుల్లో నొప్పి భరించరానిదిగా ఉంటుంది. కణితిని తీసివేసినా నొప్పి తగ్గదు. ఇలాంటి వారు నిరంతరం పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం వల్ల వాటికి అలవాటుపడ తారు. ఇటువంటి విచిత్రమైన నొప్పులకు పెయిన్‌ కిల్లర్స్‌వాడితే అని అలర్జిక్‌ రియాక్షన్‌ ఏర్పడవచ్చు. తద్వారా శరీరం అంతటా బొబ్బలు వచ్చి, శ్వాస పీల్చుకోవడం కష్టమై ఒక్కోసారి ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది. కేవలం ఒకే ఒక్క మాత్రతో కడుపులో తీవ్రమైన రక్తస్రావం ఏర్పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

పెయిన్‌ కిల్లర్స్‌

శరీరంలో ఏర్పడే నొప్పులకు పెయిన్‌ కిల్లర్స్‌ శరీరస్థితికి శరీరానికి సరిపడతాయో లేదో తెలుసుకుని వాడాలి. ఎందుకంటే ఓపియాడ్స్‌, నార్కోటిక్స్‌, మార్ఫిన్‌, కోడిన్‌, ఆక్సికోడా వంటివి పెయిన్‌ కిల్లర్స్‌ నల్లమందుతో తయారుచేస్తారు. ఈ పెయిన్‌ కిల్లర్స్‌ వాస్తవానికి హానికరమైనవే. కానీ, కేన్సర్‌ కారణంగా నొప్పి భరించలేనంత ఉన్నప్పుడు వీటిని ఇస్తారు. మెడదుతో సహజంగా ఉత్పన్నమయ్యే ఓపియాడ్‌తో ఉపశమనం గానప్పుడు ఈ మాత్రలు అవసరమవ్ఞతాయి. అయితే ఈవిషయం తెలియక కొందరు ఇటువంటి పెయిన్‌ కిల్లర్స్‌ను తీసుకుని ప్రాణాలమీదకి తెచ్చుకుంటారు. ఈ మందులను వాడే రోగి నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం పొందుతాడు.