అంతకుమించి అంటోన్న రష్మీ!

ANTAKU MINCHI11
ANTAKU MINCHI

అంతకుమించి అంటోన్న రష్మీ!

ఎస్‌ జై ఫిలింస్‌ పతాకంపై నిర్మితమవుతున్న చిత్రం అంతకుమించి. రష్మీ, సతీష్‌ జై హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత సతీష్‌. భాను ప్రకాష్‌ తేళ్ల, కన్నా సహ నిర్మాతలు. జానీ దర్శకత్వం వహిస్తున్నారు. హార్రర్‌ థ్రిల్లర్‌ జానర్‌ లో అంతకుమించి తెరకెక్కుతోంది.

హార్రర్‌ కథలో భిన్నమైన కాన్సెప్టుతో ఈ సినిమాను దర్శకుడు జానీ రూపొందిస్తున్నారు.ఇప్పటిదాకా చూడని కొత్త పాత్రలో రష్మీని చూపించబోతోందీ సినిమా. ప్రస్తుతం అంతకుమించి సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. హైదరాబాద్‌ లో చివరి షెడ్యూల్‌ ను తెరకెక్కిస్తున్నారు. రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు మినహా మొత్తం సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలాఖరుకు షూటింగ్‌ పూర్తి చేసి…వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత సతీష్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా..

రష్మీ మాట్లాడుతూ.. టైటిల్‌ కు సరిగ్గా సరిపోయే చిత్రమిది. కథా కథనాలు అంతకుమించి ఉంటాయి. నా పాత్ర పేరు మధు ప్రియ. నా కెరీర్‌ లో ఇలాంటి పాత్ర చేయలేదు. నటిగా కొత్త రష్మీని చూస్తారు. నాకు పూర్తి సంతృప్తినిచ్చిన చిత్రమిది. హార్రర్‌ సినిమాలు అనగానే కథ ముందే ఊహిస్తారు. కానీ ఈ సినిమాలో ఓ కొత్త అంశాన్ని దర్శకుడు చూపించబోతున్నాడు. ఆ పాయింట్‌ ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంది అని చెప్పారు. దర్శకుడు జానీ మాట్లాడుతూ.. దర్శకుడిగా నాకు తొలి చిత్రమిది. అన్ని కమర్షియల్‌ అంశాలు అంతకుమించి ఉన్నాయనిపించేలా సినిమా వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ లోని ఓ ఫామ్‌ హౌస్‌ లో చివరి షెడ్యూల్‌ రూపొందిస్తున్నాం. రష్మీ క్రేజ్‌ ఒక్కటే కాదు.. ఆమెను నటిగా ఆవిష్కరించే సినిమా అవుతుంది. గతంలో హార్రర్‌ తరహా కథలు చాలా చూశాం.

మేం ఈ జానర్‌ లోనే కొత్త కాన్సెప్టుతో సినిమా చేస్తున్నాం. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు సహా అందరి పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. మంచి సాంకేతిక నిపుణుల సహాయంతో అనుకున్న సమయానికి అనుకున్నట్లు చిత్రీకరణ జరుగుతోంది అన్నారు