అండర్‌-19 ఆసియా విజేత భారత్‌

WINNER
WINNER

అండర్‌-19 ఆసియా విజేత భారత్‌

న్యూఢిల్లీ: అండర్‌-19 ఆసియా కప్‌ క్రికెట్‌ టైటిల్‌ను భారత్‌ కైవసం చేసుకుంది.కాగా శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో భారత్‌ 34 పరుగుల తేడాతో శ్రీలం కను ఓడించి వరుసగా మూడవసారి విజేతగా నిలిచింది.టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచు కున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.భారత ఓపెనర్లు హిమాన్షు రాణా 71 పరుగులు,పృథ్వి షా 39 పరుగులతో శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 67 పరుగులు,రెండవ వికెట్‌కు హిమాన్షు,శుభ్‌మన్‌ 88 పరుగులు జత చేశారు.కాగా ఈ క్రమంలో హిమాన్షు రాణా, శుభమ్‌ గిల్‌ హాఫ్‌ సెంచరీలు సాధించారు.ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన షా 39 పరుగులు, కెప్టెన్‌ అభిషేక్‌ శర్మ 29 పరుగులు,సల్మాన్‌ ఖాన్‌ 26 పరుగులతో సత్తా చాటారు.చివరలో నాగర్‌ కోటి 14 బంతులు ఆడి 23 పరుగులతో ధాటిగా ఆడటంతో భారత్‌ గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. కాగా శ్రీలంక బౌలర్లలో రన్సిక, జయవిక్రమ ఒక్కొక్కరు మూడు వికెట్లు సాథిం చారు.అనంతరం 274 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక 48.4 ఓవర్లలో 239 పరుగులకే ఆలౌటై పరాజయం చెందింది.కాగా ఆరంభంలోనే చతురంగ 13 పరుగులతో వికెట్‌ కోల్పోయింది. సత్తాచాటిన అభిషేక్‌ కెప్టెన్‌ అభిషేక్‌ తన సత్తా చాటాడు. కెల్లీ,బోయగోడ 37 పరుగులకు రెండవ వికెట్‌కు 15 ఓవర్లలోనే 78 పరుగులు జోడించాడ.కాగా ఈ క్రమంలో అభిషేక్‌ బౌలింగ్‌లో బోయగోడ ఔట్‌కాగా మూడవ వికెట్‌కు కెల్లీ,మెండిస్‌ 53 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా అభిషేక్‌ తన బౌలింగ్‌లో వేరుచేశాడు. ఆ తరువాత భారత్‌ దెబ్బకు శ్రీలంక కోలుకోలేకపోయింది. గెలుపు కోసం 75 బంతుల్లో 78 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచిన శ్రీలంక,43 పరుగుల వ్యవధిలో తమ చివరి 7 వికెట్లను కోల్పోయి పరాజయం చెందింది.దీంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్‌శర్మ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలువగా టోర్నీలో 5 మ్యాచ్‌లలో కలిపి 283 పరుగులు చేసిన హిమాన్షు రాణా మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.