అండగా ఉంటా.

AP CM BABU
AP CM BABU

అండగా ఉంటా.

తిత్లీ బాధితులకు సిఎం చంద్రబాబు హామీ

విజయనగరంµ: సాధారణ స్థితి వచ్చేవరకు తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలతోనే ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. శనివారం ఇచ్చాపురం మండలం సవరదేవి పేట వద్ద బహుదా నది వరదలకు ముంపునకు గురైన పంటలను పరిశీలించారు. అనంతరం కవిటి మండలం రాజపురం, బొర్రపుట్టుగ గ్రామాల్లో కొబ్బరి, జీడిమామిడి పంటల నష్టాన్ని పరిశీ లించు నిమిత్తం ముఖ్యమంత్రి పర్యటించారు. అనంతరం ప్రజలతో మాట్లాడుతూ, అధైర్యం వద్దని ప్రజలకు సూచించారు. తుఫాన్‌ వలన కష్టం వచ్చిందని, తిత్లీ తుఫాన్‌ అతలాకుతలం చేసిందని, ఆ రోజు రాత్రంతా మెళకువగా ఉండి అధికారులతో ఐదుసార్లు టెలికాన్పరెన్స్‌ నిర్వహిం చడం జరిగిందని చెప్పారు. ముందుస్తు చర్యల ద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించగలిగామని తెలిపారు. 25 వేల స్తంభాలు, అనేక చెట్లు కూలాయని, బహుదా నది పొంగిందని, ఫోన్లు పని చేయలేదని తెలిపారు. మిమ్మల్ని ఆదుకుంటాం, తాగునీరు, విద్యుత్‌ను త్వరితగతిన పునరుద్ద రిస్తామని, మిమ్మల్ని సాధారణ స్థితికి తెచ్చేవరకు ఇక్కడే ఉంటామని ప్రజలకు ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. తుఫాన్లు ఎదుర్కొనే సత్తా పెంచుకోవాలని అన్నారు. పునరుద్దరణ పనులకు అధికారులను పంప ిస్తున్నామని తెలిపారు. వేటకు వెళ్లే మత్స్యకా రులకు 50 కిలోల బియ్యం, ఒక కిలో కంది పప్పు, కిలో పామోలిన్‌ ఆయిల్‌, కిలో బంగాళ దుంపలు, కిలో ఉల్లి, అర కిలో పంచదార, తెల్లరేషన్‌ కార్డులు కలిగిన వారికి పై సరుకులతో పాటు 25 కిలోల బియ్యం, మరణించిన ఆవులు, గేదెలకు రూ.30 వేలు, గొర్రెలు మేకలకు ఐదువేలు, పూర్తిగా ద్వంసమైన బోట్లకు పది వేలు, పాక్షికంగా దెబ్బతిన్న బోట్లకు ఐదు వేలు, పాక్షికంగా దెబ్బతిన్న వలలకు రూ.2500 పూర్తిగా దెబ్బతిన్న వలలకు ఐదు వేల రూపా యల నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పారు. పడిపోయిన కొబ్బరి చెట్లను తొలగిస్తామని, జీడిమామిడి ట్రిమ్మింగ్‌ చేసి జీవం పోస్తామని చెప్పారు. ఉద్యానవన పంటల నష్ట పరిహారం పరిశీలిస్తామని, రూ.12 వందల కోట్లతో ఇచ్చాపురం వరకు హై లెవెల్‌ కెనాల్‌ నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. తీర ప్రాంతాలలో ప్రకృతి వైపరీత్యాలకు విద్యుత్‌ వ్యవస్థ నాశనం కాకుండా ఉండే వ్యవస్థ నెలకొల్పడానికి చర్యలు తీసుకున్నట్లు ముఖ్య మంత్రి తెలిపారు. కిడ్నీ వ్యాధిపై ప్రపంచంలోనే నిపుణులతో చర్చిస్తామని తెలిపారు.