అంజన్న ఆలయ అభివృద్ధికి రూ. 11 లక్షల విరాళం

PAWAN KALYAN
PAWAN KALYAN

జగిత్యాల: తెలంగాణలో ప్రజా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కొండగట్టు చేరుకుని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్దికి రూ. 11 లక్షల చెక్కును అందజేశారు. మొదట రూ. 10 లక్షలు ఇవ్వబోయిన పవన్‌కు రూ. 11 లక్షలు ఇస్తే బావుంటుందని ఈవో సూచించారు. దాంతో పవన్‌ రూ. 11 లక్షలు ఇచ్చారు.