అంగన్‌వాడీల ప్రైవేటీకరణను ప్రతిఘటిస్తాం

Tapan Sen
– డిమాండ్ల పరిష్కారంకోసం పోరాడుతాం -అంగన్‌వాడీల జాతీయ మహాసభల్లో తపన్‌సేన్‌
హైదరాబాద్‌ : అంగన్‌వాడీల పరిరక్షణ, కార్యకర్తల డి మాండ్ల సాధనకోసం మరింత ఉదృతమైన పోరాటాలకు సిద్దం కావాలని సిఐ టియు జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు తపన్‌సేన్‌ అంగన్‌ వాడి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకాన్ని (ఐసిడి ఎస్‌) ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోకి తీసుకురావాలనే ప్రభుత్వ నేర పూరిత కుట్రను ఉద్యమాలద్వారా ప్రతిఘటించాలని కోరారు. సమాజంలోని నిరుపేద వర్గాల పౌష్టికాహారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేసే విధంగా వ్యవహరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ 8వ జాతీయ మహాసభలను తపన్‌సేన్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన సుమారు 700 మంది ప్రతి నిధులను ఉద్ధేశించి ప్రసంగించారు. అంగన్‌వాడి కార్యకర్తలకు ఉద్యోగ,సామాజిక భద్రత కల్పించా లని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడి కార్యకర్తల డిమాండ్లపైన కేంద్ర కార్మిక సంఘాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని వెల్లడించారు. అంగన్‌వాడి కార్యకర్తలు తమ డిమాండ్ల సాధనకోసం సాగించే ఉద్యమాలకు అండగా నిలిచేందుకు సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఇటీవల కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీకి కేంద్ర కార్మిక సంఘాలు అందజేసిన విఙపన పత్రంలో కూడా అంగన్‌వాడీ కార్యకర్తల డిమాండ్లను పొందుపరిచామని తెలిపారు. నిరుపేద వర్గాల గర్భిణులు, బాలింతలు, పసి పిల్లలకు పౌష్టికా హారం అందించి, వారి ఆరోగ్యం, ప్రాథమిక విద్యలో కీలక భూమిక పోషి స్తున్న అంగన్‌వాడీలను కనీసం కార్యకర్తలుగా గుర్తించేందుకు కూడా ప్రభు త్వాలు ముందుకు రావడం లేదని తెలిపారు. సమాజంలోని అట్టడుగు వర్గా లకు పౌష్టికాహారం అందించే ఐసిడిఎస్‌లను కూడా లాభాపేక్ష సంస్థలుగా భావించి కేంద్ద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడానికి సిద్దపడుతుందన్నారు. కార్పోరేట్‌ సంస్థలకు, వ్యాపార వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధానాల దిశగా సాగుతుందన్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా సేవలందిస్తున్న అంగన్‌వాడి కార్యకర్తలను రోడ్డున పడేసే చర్యలకు పాల్పడుతుందని తెలి పారు. అందులో భాగంగానే గత రెండు సంవత్సరాలుగా ఐసిడిఎస్‌లకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు వాటా విడుదల చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ పేద వర్గాలకు అందే ప్రభుత్వ ప్రయోజనాలను కూడా పాలకులు ప్రైవేటు పరం చేసే చర్యలను ప్రతిఘటించడంలో ప్రజలను భాగస్వామ్యం చేయవలసి ఉందని అన్నారు. అంగన్‌వాడీ వాలెంటర్లను కార్యకర్తలుగా గుర్తించాలని, వారిని ప్రభు త్వ ఉద్యోగులుగా పరిగణించాలని, కనీస వేతనం అమలు జరపాలని, ఉద్యోగ భద్రత కల్పించి, సామాజిక భద్రత పథకాల్లో భాగస్వాములను చేయాలని అయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధన కోసం సాగే పోరా టాలకు కార్మిక లోకం అండగా ఉంటుందని తెలిపారు. అంగన్‌వాడి కేంద్రాలను మరింతగా విస్తరింపచేయాలని, మారు మూల ఆవాసాల పసి పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు సకాలంలో పౌష్టికాహారం అందించాలని సుప్రీంకోర్టు ఇటీవలి కాలంలోనే కేంద్ర ప్రభుత్వానికి సూచించిందని తపన్‌ సేన్‌ గుర్తు చేశారు. దేశంలో కోటికి పైగా అంగన్‌వాడి కార్యకర్తలు నిరుపేద వర్గాలకు పౌష్టికాహారం అందించే సేవలో ఉన్నారని తెలిపారు. అనేక మంది పసిపిల్ల్లలను ఆరోగ్యవంతులైన భావిభారతపౌరులుగా తీర్చిదిద్దుతున్న అంగన్‌ వాడీలను కుదించడం సహేతుకం కాబోదని, కార్యకర్తలకు కనీస వేతనాలు కూడా చెల్లించక పోవడం చట్ట విరుద్దమని వివరించారు. అంగన్‌వాడి కార్యకర్త లు, సహాయకులు నిరంతరం ఉద్యమించవలసి వస్తుందని వివరించారు. ప్రభుత్వాలు సామాజిక బాధ్యతలను విస్మరించడం వల్లనే ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే క్షేత్ర స్ధాయి నుండి జాతీయ స్థాయి వరకు ఉద్యమాలు నిర్వహించి అందరి దృష్టిని ఆకర్శించారని పేర్కొన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే ఉద్యమాలు నిర్వహించిన ఘనత కూడా అంగన్‌వాడి వర్కర్లదేనని వివరించారు. సామాజిక బాధ్యత నిర్వహిస్తున్న అంగన్‌వాడి కార్యకర్తల డిమాండ్ల పట్ల సమాజం సానుకూలంగా ఉన్నప్పటవకీ పాలకుల వైఖరిలో మార్పురాకపోవడం విచారకరమని అన్నారు. ఉద్యమాల ద్యారానే ప్రభుత్వం పై ఒత్తిడి పెంచి అంగన్‌వాడి కేంద్రాలను పరిరక్షించుకోవాలని, డిమాండ్లను సాధించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షురాలు నీలిమా మైత్రి,ఆహ్వన సంఘం అధ్యక్షులు వేణుగోపాల్‌, జాతాయ కార్యదర్శి వరలక్ష్మి,సిఐటియు రాZష కార్యదర్శి సాయిబాబు, రమ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ఆవాసాల్లో 58 శాతం మంది గర్భిణులు, బాలింతలు రక్త హీనతతో బాధపడుతున్నారని వేణుగోపాల్‌ వివరించారు. గర్భిణులకు సరైన పౌష్టికాహారం లేని కారణంగా పుట్టే పిల్ల్లలు కూడా బలహీనంగా పుడుతున్నారని తెలిపారు. వారందరికి సకాలంలో వైద్యం,పౌష్టికాహారం అందవలసి ఉండని తెలిపారు. అంగన్‌వాడిలు ఈ సమస్యను అధిగమించే విధంగా పి చేస్తున్నాయని వివరించారు. అంగన్‌వాడిలను బలోపేతం చేయాలని, కార్యకర్తల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని కోరారు. అంగన్‌వాడిల నిర్వహణ ఆరోగ్యవంతమైన భారత దేశ నిర్మాణంలో భాగంగానే పరిగణించవలసి ఉంటుందన్నారు.