అంగన్వాడీ సిబ్బందికి స్మార్ట్‌ ఫోన్‌లు

SMART PHONE
SMART PHONE

హైదరాబాద్‌: పోషణ అభియాన్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ సిబ్బందకి స్మార్ట్‌ ఫోన్‌లు ఇవ్వనున్నారు. ఇందులో పిల్లలు, గర్భిణీల వివరాలను స్మార్ట్‌ ఫోన్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చు. ఆ పధకాన్ని కేంద్రప్రభుత్వం మొట్టమొదటి సారిగా హైదరాబాద్‌లో ప్రారంభించనుంది. ఇప్పటి వరకూ గర్భిణీల ఆరోగ్య వివరాలను తెలపాలంటే పేపర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు కేంద్రప్రభుత్వం స్మార్ట్‌ ఫోన్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. గర్భంతో ఉన్నవారిలో రక్త హీనత, పోషకాహార లోపం, చిన్నపిల్లల్లో వచ్చే అనారోగ్య వివరాలను ఈ ఫోన్లలో అప్‌లోడ్‌ చేయగా, వెంటనే ప్రభుత్వం ఆ సమస్యను గూర్చి స్పందించనుంది.