మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం మార్చి   12th 2010 - 9:57 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
డి మ్యాట్స్‌కు పెరిగిన డిమాండ్‌
మంగళ వారం, జనవరి 05, 2010 , 4:57 [IST]

d matముంబయి, జనవరి 4: మళ్ళీ డి మ్యాట్‌ ఖాతా లకు డిమాండ్‌ పెరుగుతున్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంధ్యంలో పడిపోవడంతో అన్ని దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు ఏర్పడ్డాయి. ప్రపంచ మార్కెట్లు పతనం కావడంతో 2008-09 సంవత్సరాలో స్టాక్‌ మార్కెట్‌ అంటేనే సామాన్య ఇన్వెస్టర్లు పారిపోయే పరిస్థితి ఏర్పడింది.  ఆర్థిక వ్యవస్థలను నిల బెట్టేందుకు ఆయా దేశాలు ఇస్తున్న ఉద్దీ పన పథకాలు ఉపసంహరిం చుకుంటే ఆర్థిక సంక్షోభం రావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే స్టాక్‌ మార్కె ట్లు పూర్తిగా పతనం అవుతాయి. ఇలాంటి వార్తలు వస్తున్నప్పటికీ ఆర్థిక వృద్ది రేట్లు బాగుందని, 2010లో ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని వస్తున్న వార్తలు రిటైల్‌ ఇన్వెస్టర్లలో మళ్ళీ ఆశలు రేపుతున్నది.

ఫలితంగా స్టాక్‌ మార్కెట్‌లో ప్రవేశించేందుకు వీరు డి మ్యాట్‌ ఖాతాలను ప్రారంభిస్తు న్నారు. ఇటివల వరకు కొత్త ఖాతాలే ప్రారంభం కాని పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. పెన్ని స్టాక్స్‌ పెరుగు తుండటం, రోజూ మొబైల్‌ ఫోన్స్‌ లోనూ, ఈ మెయిల్స్‌ లోనూ స్టాక్‌ ఎలర్ట్‌లు వస్తుండటం వల్ల రిటైల్‌ ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్‌ పట్ల తిరిగి ఆకర్షితులవుతున్నారు. రిలయన్‌ ఎస్టేట్‌, బంగారంలో ఇన్వెస్ట్‌ చేయడానికి బయపడు తున్న వారు స్టాక్‌ మార్కెట్‌ను ఎంపిక చేసు కునే అవకాశం ఉందని నిపుణులు అంటు న్నారు. ఇటీవల కాలంలో షేరు మార్కెట్‌ పెరుగుతున్న తీరు కూడా వీరిని ఆకర్షిస్తోంది. గత రెండు సంవత్సరాల్లో వచ్చిన అనేక ఐపిఓలు పట్ల రిటైల్‌ ఇన్వెస్టర్లు విముఖత చూపారు.

మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని నమ్ముతున్నందునే 2009లో ఎఫ్‌ఐఐలు 17 బిలియన్‌ డాలర్లు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టారు. ఇలాంటి వార్తలు రిటైల్‌ ఇన్వెస్టర్లలో ఆసక్తి రేపుతున్నాయి. గత కొద్ది నెలలుగా డిమ్యాట్‌ ఖాతాల సంఖ్య పెరుగుతోందని కోటక్‌ సెక్యూరిటీస్‌ వైస్‌  ప్రెసిడెంట్‌ బి.గోప్‌కు మార్‌ తెలిపారు. కొన్ని నెలలుగా డిమ్యాట్‌ అకౌంట్ల సంఖ్య పది శాతానికిపైగా పెరిగాయి. సంవత్సర కాలంలో 15 లక్షల కొత్త అకౌంట్లు ప్రారంభ మయ్యాయి. దీనితో ప్రస్తుతం వీటి సంఖ్య 1.6 కోట్లకు చేరుకున్నాయి.

రిటైల్‌ ఇన్వెస్టర్ల భాగస్వామ్య  మరింత పెరగాల్సి ఉందని ఐసిఐసిఐ సెక్యురిటీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనూప్‌ భాగ్చీ అంటున్నారు. మార్కెట్లు పూర్త స్థితికి చేరుకోవడానికి మరికొంత సమయం పడు తుందని ఆయన అంచనా. ఐపిఓల్లో రిటైల్‌ ఇన్వెస్టుర్లు మరింత ఉత్సహాంగా పాల్గొనేందుకు కొంత సమయం పడుతుందని ఆయన అభిప్రాయ పడుతున్నారు.మార్చితో ముగిసిన త్రైమాసికంలో 50 శాతం అకౌంట్లు యాక్టివేట్‌ అయితే, ఏప్రిల్‌-డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇది 70 శాతానికి చేరుకుందని భాగ్చీ చెప్పారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ ట్రేడింగ్‌ వంటివి అందుబాటులోకి రావడం వల్ల డిమ్యాట్‌ ఖాతాలు పెరిగేందుకు ఉపయోగ పడుతున్నట్లు చెప్పారు.మార్కెట్లు ఇలానే పెరుగుతూ ఉంటే రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 అస్సాం గ్యాస్‌కు కాగ్‌ అక్షింతలు
 విక్రమ్‌ సోలార్‌ పెట్టుబడులు
 అపర కుబేరుల్లో ఇద్దరు భారతీయులు
 వాటాల విక్రయానికి బిఎస్‌ఎన్‌ఎల్‌..
 మార్కెట్లోకి ఫోక్స్‌వ్యాగన్‌..
 టాంజరిన్‌ స్పా అండ్‌ సెలూన్‌..
 వీడియోల ద్వారా రైతులకు బోధన
 మార్కెట్లోకి ఫోర్డ్‌ ఫిగో కారు
 
 
ముఖ్య వార్తలు
  ఐటి, పరిశ్రమల భద్రతకు..
  'ఇంటర్‌'లో 60 వేల మంది డుమ్మా
  మైనింగ్‌ మాఫియాకు సర్కార్‌ దన్ను
  ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం..
  15 లేదా 16న లోక్‌సభలో మహిళా బిల్లు
  సొంత పార్టీ నుంచి సూకీ బహిష్కరణ
  ఒఎన్‌జిసి, ఐఒసి ఐపిఒలు ఉండవు
  కొత్త హంగులతో మాక్స్‌ ఐపిఎల్‌..
  హైతీ బాధితుల సహాయార్థం లియాండర్‌..
  రుణాల వడ్డీ మాఫీపై రాష్ట్రాల పోటీ
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com