| బ్యాంకుల్లో 40వేల ఉద్యోగాలు ఖాళీ |
| మంగళ వారం, జనవరి 05, 2010 , 4:54 [IST] |
 |
|
న్యూఢిల్లీ జనవరి 4:- ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పదవీవిరమణలు, రాజీనామాలు, వ్యాపారం పెరగడం వల్ల 40వేల ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. ఒక స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో గ్రూపులో 19వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లు అంచనా. సిండికేట్ బ్యాంకులో 3,210, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3,025, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2,870 ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లు అంచనా. అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కలిపి ప్రస్తుతం 6,71,959 ఉద్యోగాలు ఉన్నాయి. అందులో ఒక ఎస్‌బిఐ గ్రూపులోనే 2,05,896 ఉద్యోగాలు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 54,780 ఉద్యోగులు, ఆలహాబాద్ బ్యాంకులో 20,457 ఉద్యోగులు, కెనరా బ్యాంకులో 44090 మంది ఉద్యోగులు ఉన్నారు.
ఐడిబిఐ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాం కు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర ్‌సిస్ బ్యాంకు, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో ఉద్యోగులు అన్ని భర్తీ అయ్యే ఉన్నాయి. సిబ్బంది రిటైర్ కావడం, కొత్త శాఖలు ఏర్పాటు కావడం, వ్యాపారం బాగా విస్తరించడం వల్ల ఖాళీలు ఏర్పడుతున్నాయి. సరైన ప్రతిభగల అభ్యర్థులు లభించడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు.ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిరంతరం రిక్రూట్‌మెంట్లు జరుగుతూ ఉంటుం దని, ఇన్సిస్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నది.
చాలా ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉండటం, రిక్రూట్‌మెంట్లకు చాలా సమయం పట్టడం వల్ల బ్యాంకులు తమ పనితీరు మీద ప్రభావం పడుతున్నాయని చెబుతున్నాయి. 2008-09 సంవత్సరంలో 55వేల మందిని ప్రభుత్వరంగ బ్యాంకులు రిక్రూ ట్ చేసుకున్నాయి.2009-10 సంవత్సరంలో 30వేల మందిని రిక్రూట్ చేసుకోవాల్సి వస్తుందని, బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ సంస్థ అంచనా వేసింది. అయితే ఈ సంఖ్య మరింత పెరగవచ్చునని ఇటీవల గణాంకాలు తెలియ చేస్తున్నాయి.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 13వేల మంది రిక్రూట్ చేసుకోవడానికి కసరత్తు చేస్తున్నది. బ్యాంక్ ఆఫ్ బరోడా మూడువేల మందిని, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1500ల మందిని, ఆంధ్రా బ్యాంకు వెయ్యి మందిని, ఇండియన్ బ్యాంకు 700 మందిని వివిధ స్థాయిల్లో రిక్రూట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు చాలా చొరవతో వ్యవహరిస్తున్నాయి. కొత్త శాఖల సంఖ్య పెంచడమేకాకుండా ఇన్సూరెన్స్ పాలసీల విక్రయం, ఇతర ఆర్థిక లావాదేవీలవైపు మొగ్గుచూపుతున్నాయి. 2007-08లో మొత్తం బ్యాంకుల సరాసరి శాఖలు 776 ఉంటే 2008-09లో అవి 825కు పెరిగాయి. సిబ్బంది తలసరి వ్యాపార లావాదేవీలు 6.33 కోట్ల నుంచి 7.5 కోట్లకు పెరిగింది. మొత్తం బ్యాంకు నిర్వహణ ఖర్చుల్లో సిబ్బంది ఖర్చు 0.5 శాతం తగ్గి 13.52 శాతానికి 2008-09లో చేరింది. దీనిని మరింత తగ్గించాలని బ్యాంకులు చూస్తున్నాయి.
|
|
|
|
|
|
|