మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
జాయింట్లకు శక్తినిచ్చేది కృష్ణాసనం
మంగళ వారం, జనవరి 05, 2010 , 4:47 [IST]

yogaనా వయస్సు 37 సంవత్సరాలు. నాకు అప్పు డప్పుడు తొడలు బాగా నొప్పిగా ఉండి నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది.  నా నొప్పి  తగ్గే మార్గం యోగలో ఏమైనా ఉంటే దయచేసి తెలియ జేయగలరు.
శ్రావ్య, సాలూరు.

ఈ ఆసనం క్రమం తప్పకుండా చెయ్యండి.
కుడిప్రక్కకు తిరిగి, కుడి అరచేతి మీద తల ఉంచి ఎడమ కాలు ఎత్తి, ఎడమ చేతితో ఎడమకాలు పిక్క పట్టుకొని ఎత్తాలి, కాలి పాదాన్ని10సార్లు ఎత్తుతూ వంచుతూ ఉండాలి. స్థితిలో ఎడమ చేతిని మోకాలు కింద ఆనించి ఎడమకాలును పిక్కను కిందికి, పైకి కిందికి మడుస్తూ చాచుతూ ఉండాలి.ఈవిధంగా 10సార్లు కాలుమార్చి చేయండి.

అనులోమ, విలోమ ప్రాణాయామం చేయండి

కుడిచెయ్యి బొటనవ్రేలుతో కుడిముక్కు మూసి, ఎడమ ముక్కుతో శ్వాస పీల్చి కుడిముక్కుతో వదిలి కుడితో తీసుకొని ఎడమతో వదలాలి.ఈవిధంగా 5సెకన్లు తీసుకొని, 5సెకన్లు వదలాలి. మొదటి రోజు 5నిమిషాలు నెల వచ్చేవరకు 25నిమిషాలు చెయ్యండి. దీంతో పాటు రాత్రి వేళలో నిద్ర పోయే ముందు నువ్వులనూనె గోరువెచ్చ చేసి బాధ ఉన్న దగ్గర రుద్దండి. మీ సమస్య క్రమక్రమేణా తగ్గుతుంది.

yogaనేను నడుమునొప్పితో బాధపడుతున్నాను. పొట్టకూడా ఎక్కువగానే ఉంది. ఈరెండు సమస్యలను తొలగించే పద్ధతిని యోగలో ఏమైనా ఉంటే సూచించగలరు.
విశాలాక్షి, తిరుపతి

ఈ ఆసనాన్ని క్రమం తప్పక చేయండి.
మార్జారాసనం
మొదట వజ్రాసనంలో కూర్చోవాలి. శరీరం ముందుకు వంచుతూ రెండు మోకాళ్లు, రెండు అరచేతులను నేలకు ఆనించాలి. నడుమును పైకి ఎత్తి తలను కొద్దిగా క్రిందికి దింపాలి. శ్వాసను వదలాలి. రెండవ దశలో నడుం కిందకు వంచి తలను పైకి ఎత్తి శ్వాసను పీలుస్తూ ఈ క్రియ చేయండి. ఎనిమిది సార్లు ఈవిధంగా చేయండి.దీంతో పాటు పైన సూచించిన అనులోమ, విలోమము నెల వచ్చేనాటికి 15నిమిషాలు చేయండి.

కపాలబాతి తప్పకచెయ్యాలి.

శ్వాస బయటకు, పొట్టలోనికి (జట్క), సెకనుకి ఒకసారి, నిమిషానికి 60సార్ల చొప్పున మొదటి రోజు 5నిమిషాలు ప్రారం భించి ఒక నెల వచ్చేనాటికి 15నిమి షాలు చేస్తే మీ సమ స్యను దూరం చెయ్య వచ్చు. సాధనకు సాధ నకు మధ్య తప్పక విశ్రాంతి
ఇస్తూ చేయండి.
 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 రాధాతత్త్వము
 స్నేహితులంటే ఎలా ఉండాలి?
 సమానవాదమే మనవాదం
 మెప్పించే మాటతీరు
 పిన్నవయసు సిఇఒ
 తల్లిపాల బ్యాంకు మరొకటి
 సీ'రియల్'‌లో వాస్తవాలెక్కడ?
 రాఖీ వెనుక రాచగాధలు
 పాక్‌ ప్రధాని లత అభిమాని
 వీణా వాదనలో ప్రవీణ
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com