మార్చిన వార్తా విశేషాలు - గురు వారం మార్చి   18th 2010 - 3:16 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
చిన్న క్షమాపణే పెద్ద మనసు
మంగళ వారం, జనవరి 05, 2010 , 4:42 [IST]

cheliమన స్నేహితుల్ని మనం ఎంపిక చేసుకోవచ్చుగానీ మన తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఇతర బంధువులు వీరిని ఎంపిక చేసుకోవటం అనేది మన చేతుల్లో లేదు. నేటి రోజుల్ని యాంత్రిక యుగంగా  చెప్పుకుంటున్నాం.మనుషుల మధ్య బంధాలు కూడా అంతే యాంత్రికంగా అయిపోతున్నాయని వాపోతున్న వారిని చాలామందినే చూస్తున్నాం. ఈ బంధాలు తెగిపోకుండా ఇలా నడచుకోండి.

తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఆస్తి తగాదాలు కోర్టుల వరకు వెళ్ళటం కూడా ఇప్పుడు ఏ మాత్రం విచిత్రం కాదు. అయితే ఒకటి నిజం. అను బంధాల మధ్య చీలికలు ఎంతగా వచ్చినా కొన్ని బంధాలు కలకాలం నిలుపుకోవాల్సినవి ఉంటాయి. వాటిని నిలబెట్టుకోవటం, అంత కంటే ముఖ్యంగా ఈ విభేదాల మధ్య మనసు నలిగి పోకుండా కాపాడుకోవటం తప్పని సరి. దగ్గరివారితో మనస్పర్ధలు వచ్చినపుడు వారితో వ్యవహరించడం చాలా కష్టమైన విషయంగా ఉంటుంది.  వారి మీదున్న ప్రేమాప్యాయతలు, వారితో పెనవేసుకున్న భావోద్వేగాలు  మరింత ఇరుకున పెడుతుంటాయి. రకరకాల భావాలు ముప్పిరిగొని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఇటు వంటపుడు ఎలా ప్రవర్తించాలి అనేది పెద్ద సమస్యగా కనబడుతుంది. 

అవతలి వారి పట్ల కోపతాపాల్ని ప్రదర్శించాలనీ ఉంటుంది. అదే సమయంలో వారు తమని అర్థం చేసుకుని పూర్వపు బంధం తిరిగి చక్కగా కొన సాగాలనే ఆశా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఎవరి వ్యక్తిత్వం వారు నిలబెట్టుకుంటూ ప్రవర్తిం చడం కష్టసాధ్యమైన విషయమవుతుంది. అవతలి వారిపై అనవసరపు కోపతాపాలు ప్రదర్శించ కుండా, తాము లేనిపోని అపరాధ భావనకు గురికాకుండానూ ఉండాలంటే-  ఏ కారణం వల్ల మీ బంధం విచ్ఛిన్నమైనా అందులో మీ పాత్ర ఎంత వరకు ఉందో దానిని అవతలివారికి వివరించండి. మీ తప్పొప్పుల గురించి మరీ ఎక్కువ వివరణ ఇవ్వాల్సిన  అవసరం లేదు. అది పరోక్షంగా పూర్తి తప్పుని మీమీద   వేసుకున్నట్టు అవుతుంది.్శ మాట్లాడుతున్నపుడు అవతలి వ్యక్తి కళ్ళలోకి నేరుగా చూడండి. తల వంచుకోవటం, కళ్ళు పక్కకు  తిప్పుకోవటం వంటివి చేయకండి. మీ మాటతీరుని కూడా సరిచూసుకోండి. మరీ పెద్దగా లేదా మరీ చిన్నగానూ మాట్లాడకండి.

పరస్పర సంభాషణల్లో వ్యక్తిగత దూషణలకు తావివ్వకండి. ఆయా సందర్భాల్లో మీకు నచ్చని అవతలివారి ప్రవర్తన గురించి మాత్రమే మాట్లాడండి. ఇక,  మీపట్ల వారి అనుచిత  ప్రవర్తనని చెప్పాల్సి వచ్చినపుడు పదిసార్లు నువ్వలా చేసావు. ఇలా చేసావు అంటూ- 'నువ్వు అనే పదాన్ని ఎక్కువ సార్లు ఉపయోగించకండి. అప్పుడు వారి తప్పుల్ని పదేపదే ఎత్తి చూపి నట్టు తీవ్రంగా విమర్శించినట్టు అవుతుంది.అలా కాకుండా ఆయా సందర్బాల్లో మీరు ఎదుర్కొన్న బాధలమీద మీ మానసిక వేదన మీద మీ దృష్టి  ఉంచండి. 'ఆ సందర్భంలో నేనింత బాధపడ్డాను. ఆ మాటలు నన్నింత బాధించాయి...ఇలా సాగాలి.  అంటే ఇదంతా అవతలి వారిమీద ద్వేషంతోనో పగతోనో అంటున్నది కాదు, మీరు ఎదుర్కొన్న అసౌకర్యాన్ని చెప్పడం మాత్రమే అని అర్థ మవ్వాలి. ఆప్తులతో మీ కెంత ఎడబాటు వచ్చినా వారిపట్ల మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతల్లో మాత్రం తేడా రానివ్వకండి. ఇతర బంధువులద్వారానో, స్నేహితులద్వారానో ఆ బాధ్యతలు నిర్వ ర్తించండి.ఇరువురి మధ్య బంధాన్ని పునరుద్ధరించే సందర్భాల్లో ఉన్నతంగా ప్రవర్తించండి.

cheliమన్నించడం ముఖ్యం
ఆయా సంఘటల వెనుక కారణం ఎవరైనా మీ దృ క్పథంలో సానుకూల వైఖరి ఉండాలి.మిమ్మల్ని ఎంతగా బాధించినా ఆయా వ్యక్తుల మీద వ్యక్తిగత ద్వేషాన్ని పెంచుకోకండి. మిమ్మల్ని బాధించిన సంఘటనలు అప్పటి వారి ప్రవర్తనని మాత్రమే ఖండించండి. వ్యక్తుల్ని, వారి పనుల్ని వేరు చేసి చూడటం అలవాటు చేసుకోండి. మిమ్మల్ని వారు నిందించారని బాధపడే ముందు ఒక విషయం గమనించండి. కొన్ని విషయాలకు మిమ్మల్ని బాధ్యుల్ని చేసినట్టే, కొన్ని అననుకూల సందర్భాల్ని తామూ ఎదుర్కొన్నట్టు వారు ప్రకటిస్తున్నారు.ఈ మనస్పర్థలు అడ్డుపెట్టుకుని ఎప్పటెప్పటివో తప్పొప్పులు తవ్వాలని ప్రయత్నించకండి. ఇది పలచబడుతున్న బంధాన్ని పూర్తిగా తెంపు తుంది.  ఆ సందర్భాన్ని, సంఘటనల్ని మాత్రమే ఎత్తిచూపండి.

్శ మిమ్మల్ని ఇతరులు నిందిస్తున్నారు అంటే అందుకు కారణాలు ఏమిటి అనేది నిష్పక్ష పాతంగా పరిశీలించండి. అవి ఇది వరకటి మీ ప్రవర్తనకు సమాధానాలే అయితే ఇక అక్కడితో మీరు స్పందించకుండా ఆగిపోండి.మళ్ళీ మీ నుంచి ప్రతిస్పందన ఉంటే విరోధానికి కొత్త విత్తనాలు చల్లినట్టే. ఏ బంధం కలకాలం నిలవాలన్నా ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఎంత ముఖ్యమో క్షమా గుణం అంతకంటే ముఖ్యమని గ్రహించాలి. ఎందుకంటే చిన్న చిన్న అలకలు, కోపాలనుంచి పెద్దస్థాయి మానసిక అగాథాల వరకు- ఇవన్నీ అన్ని బంధాల్లోనూ అత్యంత సహజం. వాటిని అలా కొనసాగించడమే పూర్తి అసహజం.
 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 దారపుపోగుల చక్కని కూర్పు
 వృషభరాశి
 ఔషధ ఉగాది
 శ్రీవికృతినామ సంవత్సర స్త్రీలకు..
 ముద్దుగానే ముద్ద
 'చారిత్రికంతో మల్లాది వసుంధర..
 'స్త్రీ శక్తి మహెజబీన్‌
 మనదే మరోలోకం
 మనలో మనం దిశగా
 ముందంతా మహిళా ప్రపంచమే
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com