గీతాకృష్ణ స్వీయ దర్శకత్వంలో త్రిభాషా చిత్రంగా బ్లూఫాక్స్ సినిమా పతాకంపై రూపొందుతున్న 'కాఫీబార్ చిత్రం లోని పాటలకు మంచి స్పందన వస్తోంది.శశాంక్, బియాంక దేశా§్‌ు, అతుల్ కులకర్ణి, సుమన్, గిరీష్ కర్నాడ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ ఇంటర్మీడియేట్, డి.టి.ఎస్. జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి గీతాకృష్ణ మాట్లాడుతూ 'ప్రస్తుతం రాష్ట్రంలో వ్ఞన్న సంక్షోభం మూలంగా చిత్రం విడుదలలో జాప్యం జరుగుతోంది. మూడు భాషల్లో ఏక కాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది.
గతంలో నేను రూపొందించిన 'సంకీర్తన, 'కోకిల 'కీచురాళ్ళు చిత్రాల తరహాలోనే ఈ చిత్రం అద్భుతంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి రీ రికార్డింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కళాత్మక చిత్రానికి కమర్షియల్ హంగులు జోడిస్తే సినిమా ఎలా ఉంటుందో 'కాఫీబార్ చూస్తే తెలుస్తుంది.అంతర్లీనంగా మెసేజ్ వ్ఞంటుంది. శశాంక్ చక్కటి అభినయానిన ప్రదర్శించారు అని అన్నారు. మైండ్‌గేమ్‌తో సాగే ఈ చిత్రానికి గీతాకృష్ణ స్వీయ సంగీతాన్ని అందిస్తున్నారు.