| హారర్ కథతో 'మోక్ష' |
| మంగళ వారం, జనవరి 05, 2010 , 4:26 [IST] |
 |
|
మీరాజాస్మిన్ ప్రధాన పాత్రగా రూపొందుతున్న హారర్ చిత్రం 'మోక్ష. శ్రీకాంత్ వేముల పల్లి దర్శకుడు. అమర్ నాథ్ మూవీస్ పతాకంపై పి.అమర్‌నాథ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం యాభై శాతం పూర్తయింది.నిర్మాత చిత్ర విశేషాలను తెలుపుతూ 'ఇదొక హారర్ చిత్రం. కొత్త ఆలోచనలతో వాణిజ్య అంశాల మేలు కలయికగా ఈ చిత్రాన్ని రూపొంది స్తున్నాం.
మీరా జాస్మిన్ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారు. నవంబర్ 11 నుంచి 6 వరకు రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన ఏకధాటి షూటింగ్‌తో తొలి షెడ్యూల్ పూర్తయింది.మరో షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో జరుగుతుంది అని చెప్పారు. ఈచిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్.పి. నిర్మాత: పి. అమర్‌నాథ్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ వేములపల్లి.
|
|
|
|
|
|
|