| స్నేహం కోసం 'బెట్' |
| మంగళ వారం, జనవరి 05, 2010 , 4:23 [IST] |
 |
|
స్నేహం కోసం ప్రాణాల్చిచ్చేంత గొప్ప మనసున్న యువకుడి జీవిత ప్రయాణం ఎలా సాగింది? ప్రేమలో స్వార్థం వ్ఞంటుందేమో కానీ స్నేహంలో ఎలాంటి స్వార్థం వ్ఞండదు అని విశ్వసించే ఆ యువకుడి జీవితం ఎలాంటి ములుపులు తీసుకుంది అనే ఆసక్తికర కథాంశంతో రూపొందుతున్న చిత్రం 'బెట్. భరత్, ప్రియమణి జంటగా నటించిన ఈ చిత్రానికి సురేష్‌కృష్ణ దర్శకుడు. తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని శిల్పి క్రియేషన్స్ పతాకంపై నిర్మాత తొండపు నాగేశ్వరరావ్ఞ తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''బెట్ (దేనికైనా ఛాలెంజ్) అన్నది ఉపశీర్షిక. వైజాగ్, మారిషస్, దుబా§్‌ులలో షూటింగ్ జరిపాం.
అయిదు పాటలుంటాయి. అనువాద కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.జనవరి నెలలో ఆడియోను, అదే నెలాఖరులోగానీ, ఫిభ్రవరి మొదటివారంలోగానీ చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: దేవా, కెమెరా: భూపతి, నిర్మాత: తొండపు నాగేశ్వరరావ్ఞ, దర్శకత్వం: సురేష్‌కృష్ణ.
|
|
|
|
|
|
|