మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
బ్యాంకింగ్‌ డిపాజిట్లు-నామినేషన్‌ విధానాలు
మంగళ వారం, జనవరి 05, 2010 , 4:10 [IST]
టివి గోవిందరావు

dhanaఎవ్వరైనా ఖాతాదారుడు బ్యాంక్‌లో ఉండే డిపాజిట్లు ఒకరి పేరున లేక ఎక్కువ మంది పేరున ఉంటే వారందరూ అతని మరణాంతరం డిపాజిట్‌ సొమ్ము ఒక వ్యక్తికి ఇవ్వాలని నిర్ణీత ఫారంలో నామినేట్‌ చేయవచ్చు. ఆ డిపాజిట్‌ సొమ్ముపై ఆవిధంగా  నామినేషన్‌ రాస్తే మరణిం చిన వ్యక్తి విల్లు రాసినా లేక ఇతర వారసత్వ చట్టాల అంశాలు అమలుకావు. నామినికి డిపాజిటర్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ సొమ్ముకి మైనర్‌ నామినీగా ఉంటే ఆ వ్యక్తి మైనార్టీలో ఉండగా డిపాజిటర్‌ మరణిస్తే మైనర్‌ తరపున సొమ్ము  తీసుకొనడానికి మరొక వ్యక్తిని డిపాజిటర్‌ నియమించవచ్చును.నామినీకు బ్యాంక్‌ డిపాజిట్‌ సొమ్ము చెల్లిస్తే  బ్యాంక్‌ బాధ్యత తీరుతుంది.

ఫిక్స్‌్‌డ్‌ డిపాజిట్‌ కాలపరిమితికి ముందు డిపాజిటర్‌ మరణిస్తే ఫిక్స్‌డ్‌ కాలపరిమితికి ముందు నామినీ సొమ్ము విత్‌డ్రా చేసుకోవ చ్చును.వీటికి సంబంధించిన తీర్పును అలహా బాద్‌ హైకోర్టు 1990లో ఇచ్చింది. సెంట్రల్‌ బ్యాంక్‌-ఎదిరి -పార్వతి కేసులో తీర్పు స్పష్టంగా ఉంది. అయితే ఇద్దరి పేరు మీద నామినేషన్‌ చేస్తూ ఇచ్చే డిపాజిట్‌నే బ్యాంక్‌ నిరాకరించ వచ్చును. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 1988లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌- ఎదిరి-చంద్రమ్మ కేసులో వివరించింది.

బ్యాంక్‌ డిపాజిట్స్‌కి నామినీకాక ఇతర వ్యక్తులు ఆ డిపాజిట్‌ సొమ్మును క్లయిమ్‌ చేస్తూ ఇచ్చిన నోటీసును బ్యాంక్‌ ఖాతరు చేయదు. అయితే ఆ డిపాజిట్స్‌పై కోర్టు ఇచ్చిన డిక్రీని బ్యాంక్‌ పరిగణలోకి తీసుకుంటుంది. బ్యాంక్‌ సేఫ్‌ కస్టడీలో ఎవ్వరైనా ఖాతాదారుడు ఏదైనా వస్తువులను ఉంచి వారి అనంతరం ఒక వ్యక్తికి చెందాలని నిర్ణీత పద్ధతిలో నామినేషన్‌ ఇవ్వవచ్చు. అయితే నామినీ మైనర్‌ అయితే ఆ మైనర్‌ తరుపున తీసుకునేందుకు వేరొక వ్యక్తిని నియమించవచ్చు. రిజర్వు బ్యాంక్‌ సూచించిన విధంగా ఆ వస్తువులను తిరిగి ఇచ్చే ముందు  బ్యాంక్‌ వాటి ఇన్‌వెంటరీ రాసి ఆ కాపీని నామినీకి బ్యాంక్‌ ఇస్తుంది. నామినేషన్‌ ఉంటే విల్‌, వారసత్వరీత్యా వారసుల క్లయిమ్‌ పరిగణలోకి  ఆ వస్తువు తీసుకునే వీలులేదు.

సేఫ్‌ కస్టడీకి ఇచ్చిన ఆర్టికల్‌పై నామినీ కాక ఇతరులు బ్యాంక్‌కు నోటీసు ద్వారా పంపే క్లయిమ్స్‌ బ్యాంక్‌ను బైండ్‌ చేయవు. అయితే కోర్టులు ఇచ్చిన డిక్రీ ఆర్డర్‌ను బ్యాంక్‌ పరిగణలోకి తీసుకుంటాయి. ఏదైనా ఒక బ్యాంక్‌ నుండి లాక్‌ను అద్దెకు తీసుకున్నవారు వారి మరణాంతరం ఆ లాకర్‌లో ఉన్న వస్తువులు, పేపర్లును తీసుకోవ డానికి ఒక వ్యక్తిని నామినేట్‌ చేయవచ్చు. ఇక లాకర్‌ను ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు సంయుక్తంగా అద్దెకు తీసుకుని జాయింట్‌ సంతకాలతో నిర్వహిస్తే వారు ఒకరు లేదా ఎక్కు వ్యక్తులను నామినేట్‌ చేసుకునేందుకు వీలుంది.అద్దెకు తీసుకుని  బతికి ఉన్న వారు. నామినీలు ఆ లాకర్‌ను జాయింట్‌గా నిర్వహించడానికి బ్యాంక్‌ అనుమతిస్తుంది.

లాకర్‌లోని వస్తువులను బ్యాంక్‌ అందచేసినపుడు బ్యాంక్‌ ఇన్వెంటరీ రాసి వాటిపై నామినీలు, బ్రతికిఉన్నవారు సంతకాలు చేసిన తరువాత బ్యాంక్‌ భాద్యత ఇక ఉండదు. బ్యాంక్‌ లాకర్‌లో వస్తువులు తీసుకోవడానికి బ్యాంక్‌ అనుమతి ఇవ్వడం వల్ల కలిగిన నష్టాలకు, కలిగే
నష్టాలు వసూలు పై బ్యాంక్‌ పై కోర్టులో వేసిన దావాలు చెల్లుబాటు కావు. అదే విధంగా బ్యాంక్‌ లాకర్‌ విషయాలపై అద్దెకు తీసుకున్నవారు కాకుండా మిగిలిన వారు దావాలు, క్లయిమ్స్‌ చెల్లవు.
బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం-1949 సెక్షన్‌ 46 ప్రకారం ఏదైనా బ్యాంక్‌ మేనేజర్‌ సమాచారాన్ని అసత్య ప్రచారం చేసినా లేదా రిటర్న్‌ బ్యాలెన్స్‌షీట్‌ డాక్యుమెంటులో అసత్య ప్రకటన చేసినా స్టేట్‌మెంటును తప్పుగా చూపినా 3 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. సెక్షన్‌ 35 సబ్‌ సెక్షన్‌-3 ప్రకారం బుక్‌, అకౌంటు, డాక్యుమెంటు, స్టే సమాచారాన్ని ఇవ్వకపోయినా బ్యాంక్‌ ఉన్నతాధి కారుల ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోయినా ప్రతీ రోజుకూ రూ.2,000లు, ఆఫీసు కొనసాగించే ప్రతీ రోజుకూ వంద రూపాయలు జరిమానా చెల్లించాలి. బ్యాంక్‌ డిపాజిట్లు స్వీకరించడంపై సెక్షన్‌ 35 (4)ఎ కింద నిసేధం, ఆర్‌బిఐ ప్రకటించిన తరువాత బ్యాంక్‌ డిపాజిట్లు స్వీకరిస్తే బ్యాంకింగ్‌ కంపెనీ డైరెక్టర్‌ ఆఫీసర్‌ తీసుకున్న డిపాజిట్‌ సొమ్ముకు 2 రెట్లు ఫైన్‌ శిక్ష పొందుతారు.

బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టంలో అంశాలు పాటింపు పై జారీ చేసిన ఆజ్ఞలను, ఉత్తర్వులను, నియమనిబంధనలను పాటించకపోయినా సెక్షన్‌- 45(7) ప్రకారం రూ.50వేలు డిఫాల్ట్‌ కన్వర్ష్‌న్‌ పొందిన సొమ్ముకు రెండు రెట్లు ఫైన్‌ చెల్లించాలి.డిఫాల్టర్‌ కొనసాగితే ప్రతీ రోజూ రూ.2,500 జరిమానా శిక్ష పొందుతారు.ప్రతీ బ్యాంక్‌ తమ తమ డిమాండ్‌ కాల పరిమితికి చెందిన విలువలలో 75 శాతం విలువకు తగ్గని ఆస్తులను ప్రతీ 3 నెలలకూ అనగా మార్చి, జూన్‌, సెప్టెంబర్‌, డిసెంబర్‌ నెలలకు చివరి శుక్రవారం కలిగి ఉండాలి. ఈ ఆస్తుల రిటర్న్‌ని మూడు నెలలు ముగిసిన నెల రోజులు లోపుగా రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫారాలులలో రిటర్న్‌ ఇవ్వాలి. రూరల్‌ బ్యాంక్‌లు జాతీయ బేంక్‌లను రిటర్న్స్‌ఇవ్వాలి.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ గడువు తీరిని తరువాత, 10 సంవత్సరాలు దాటి మిగిలిన అకౌంట్సు 10 సంవత్సరాలుగా ఆపరేట్‌ చేయని అకౌంట్లు వివరాలను రిజర్వుబ్యాంక్‌ కు ప్రతీ బ్యాంక్‌ కేలండర్‌ సంవత్సరానికి ముగిసిన ఒక నెల రోజులుగా పంపాలి. రీజనల్‌ రూరల్‌ బేంక్‌ నేషనల్‌ బ్యాంకులకు పంపుతారు. అదే విధంగా ప్రతీ బ్యాంక చివరి శుక్రవారంకు తమ ఆస్తులు, చెల్లింపులు వివరాలను నిర్ణీత ఫారంలో రిజర్వు బ్యాంకుకు పంపిస్తారు.
 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 మారిన యులిప్‌లో లాభం కొంతే
 క్యూ 1 ఫలితాలే ఈ వారం మార్కెట్‌ దిశా..
 జీవితం బహుదూరపు ప్రయాణం
 ఫోర్బ్స్‌ వ్యాపారవేత్తలు
 పింఛనుదార్లు పరిహారం
 ఇల్లు కొనేముందు జాగ్రత్తలు
 బ్యాంకుల నిర్లక్షంతో..
 22 క్యారెట్ల బంగారంలో వాస్తవమెంత?
 అందనంత దూరం... బంగారం
 ఇన్వెస్టర్ల సందేహాలకు సమాధానాలు
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com