|
కోల్‌కతా : ఇక్కడ ఆస్పత్రిలో న్యుమోనియాకు చికిత్స పొందుతున్న మార్స్సిస్టు దిగ్గజం జ్యోతిబసు ఆరోగ్యం ఆదివారం మెరుగుపడింది. ఆయన ఆరోగ్యం నిలకడగాఉంది. ''నిన్నటితో పోల్చితే ఈరోజు బసు ఆరోగ్యం మెరుగునడింది. ఆయన పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉంది అని ఎఎంఆర్‌ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాబా సాహిష్ శర్మ తెలిపారు. బసును మరో 48గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతున్నట్లు కూడా ఆయన చెప్పారు. ''న్యుమోనియా కారణంగా ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్‌తోపాటు బసు మిగతా అన్ని అవయవాలు బాగా పనిచేస్తున్నాయి అని ఆయన పేర్కొన్నారు.
|