|
హెెబ్బాళ్,డిసెంబర్ 3,ప్రభాతవార్త: వచ్చే మార్చి నెల చివరి నాటికి బెంగళూరులో సబర్బన్ రైళ్ళ సర్వీ సులనుప్రారంభించనున్నట్లు రైల్వేశాఖా సహాయ మంత్రి కె.హెచ్.మునియప్ప పేర్కొన్నారు. ఆది వారం స్థానిక యశ్వంతపురం రైల్వే స్టేషన్‌లో యశ్వంతపూర్-హౌరాలమధ్య వీక్లీ నూతన నాన్ స్టాప్ రైలుసర్వీసును ప్రారంభించారు. ఈ సంద ర్బంగా మంత్రి మాట్లాడుతూ బెంగళూరు నగరం నుండి కెంగెరి, యలహంక, దేవనహళ్ళి, కష్ణ రాజపురం,ఆనేకల్, మైసూర్ రోడ్డుకు మొదటి విడతగాప్రారంభించనున్నట్లు తెలిపారు. కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించిన 9నూతనరైళ్ళలలో ఇప్ప టికే 6రైళ్ళ సర్వీసులను ప్రారంబించామన్నారు. మిగిలిన 3రైళ్ళను ఫిబ్రవరి నాటికి ప్రారంబిస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు ఎంపి పి.సి.మోహన్,శాసనసభ్యులు అశ్వర్థనారాయణ, దినేష్ గండూరావ్ తదితరులు పాల్గొన్నారు.
|