|
ఢిల్లీలో ప్రముఖుల శ్రద్ధాంజలి న్యూఢిల్లీ, జనవరి 3: ప్రముఖ హిందీ సాహితీ వేత్త, స్వర్గీయ కమలారాణి సంఘీ ఆత్మశాంతి కోసం ఆదివారంనాడిక్కడ ప్రార్థనలు జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన భజన గాయకుడు శరద్ గుప్తా భజన గీతాలు ఆలపించారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వైశ్య సంఘం నేతలు సహా వందలాదిమంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని దివంగత సాహితీమూర్తికి నివాళులర్పిం చారు. అఖిల భారతవైశ్యమహాసమ్మేళన్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు గిరీష్ కుమార్ సంఘీ మాతమూర్తి అయిన కమలారాణి గత నెల 25న హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వానవిడిచిన సంగతి తెలిసిందే. 87 ఏళ్ల కమలారాణి విఖ్యాతిపొందిన హిందీ రచయిత్రులతో ఒకరు. సాహితీ సజనతోపాటు ఆమెచాలాకాలంపాటు సమాజసేవకూడా చేశారు. ఆమెకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమా ర్తెలు, మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు. వారి కుమారుల్లో గిరీష్ కుమార్‌సంఘీ కనిష్ఠులు.
గిరీష్ సంఘీ నివాసంలో జరిగిన ఈ ప్రార్థనా కార్యక్రమంలో ఆయనతోపాటు ఆయన సతీమణి అల్కాసంఘీ, కుమారుడు రవిసంఘీ, కుమార్తె శోభాజైన్‌తోపాటు సంఘీ కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైకమలారాణి సంఘీకి శ్రద్ధాసుమాలు అర్పిం చిన వారిలో కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ బలరామ్ జాఖడ్, కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్, రాజ్యసభ మహా సచివ్ అగ్నిహోత్రి, అనిల్ శాస్త్రి తదితరులు ఉన్నారు.
|