|
తిరుమల, జనవరి 3. పభాతవార్త : పవిత్రత, ప్రశాంతతకు నిలయమైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను కొందరు రాజకీయ వేదికగా మార్చు కుంటున్నారు. శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో తిరు మలకు వస్తున్న భక్తులకు సౌకర్యాలు కల్పించా ల్సిన బాధ్యతను పక్కనబెట్టి రాజకీయాలు, వ్యక్తి గత విమర్శలతో ధార్మిక సంస్థను అభాసుపాలు చేస్తున్నారు. పాలక మండలి చైర్మన్ డికె.ఆదికేశ వులునాయుడు, ఎక్స్‌అఫిషియో సభ్యుడు చెవి రడ్డిల మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. కొంతకాలంగా పరస్పర విమర్శలు చేసుకుం టున్న వీరిద్దరూ శనివారం మరింత రెచ్చిపోయి దుమ్మెత్తి పోసుకున్నారు.
బహిరంగ విచారణకు సిద్ధమేనా..అనిఒకరంటే, అసలు నీస్థాయికి నేను దిగజారలేనంటూ మరొకరు సవాలు విసిరారు. కొంతకాలంగాపాలకమండలిలోని ఇద్దరుసభ్యులు చెవిరెడ్డిభాస్కరరెడ్డి, విజయసాయిరెడ్డిల, చైర్మన్ డికె. ఆదికేశవులు నాయుడులతో తీవ్ర అభిప్రా యభేదాలు ఏర్పడ్డాయి.ముఖ్యంగా చెవిరెడ్డికి చెం దిన తుమ్మలగుంట ఆలయానికి టిటిడి నుండి నిధులు నిలిపేశారు. అలాగే సభ కమిటిలలో ప్రాధాన్యత తగ్గించారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి, చైర్మన్‌పై ఆగ్రహంతో ఉన్నారు.అలాగే చెవిరెడ్డికి మరోసభ్యుడు విజయ సాయిరెడ్డి మద్దతు ఇస్తున్నారు. ఆనంద నిల యం అనంత స్వర్ణమయం పథµకాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నించారు. ఈపథకం ద్వారా తనపేరు ప్రఖ్యాతులు చరిత్రలో నిలిచే అవకాశం కోసం ఎదురు చూస్తున్న చైర్మన్‌కు ఈ అసమ్మతి రాగం మింగుడుపడలేదు. ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమంలో తిరుపతిలోని బస్సును దగ్ధం చేసిన కేసులో చెవిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వారి మధ్య వివాదం మరింత ముదర డానికి దారితీసింది. చెవిరెడ్డి అరెస్టు వెనుక డికె హస్త వుందనే ఆరోపణలు వచ్చాయి. ఇదిలా వుండగా నాలుగు రోజుల క్రితం జరిగిన వైకుంఠ ఏకాదశినాడు చైర్మన్ తనపాసులు కూడా లాక్కు న్నారని చెవిరెడ్డి ఆరోపించారు.దీనికి ప్రతిగా గత పాలక మండలి ఎక్కువ పాసులు జారీ చేసిందని డికె తిప్పికొట్టారు. దాంతో దీన్ని నిరూపించా లని, లేకుంటే రాజీనామా చేయాలని చెవిరెడ్డి పట్టుబట్టారు. దీంతో శనివారం చైర్మన్ మాట్లా డుతూ చెవిరెడ్డి అవినీతి ఆరోపణలపై విచారణ కమిటీి వేస్తే వాస్తవాలు వెల్లడి అవుతాయన్నారు. ఆయన సంగతి తేలుస్తామని శివమెత్తిపోయారు.
ఇదిలా వుండగా గురువారం జరిగిన పాలక మం డలి సమావేశాన్ని చెవిరెడ్డి, విజయసాయిరెడ్డిలు బహిష్కరించడమే గాక మీడియా ఎదుట డికెపై విమర్శలు గుప్పించారు. ఇది ప్రత్యక్ష ప్రసారమ యింది. చైర్మన్ సైతం తానేమీ తక్కువ తినల దంటూ శనివారం దాదాపు అన్ని టివి చానెళ్ళను పిలిపించి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీరిద్దరిపై కారాలు మిరియాలు నూరారు. పవిత్ర తిరుమ లలోపరువు పోయేలాగా వ్యవహరిస్తున్న పాలక మండలితీరుపై టిటిడిఉన్నతాధికారులు, భక్తులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
|