మార్చిన వార్తా విశేషాలు - గురు వారం మార్చి   11th 2010 - 7:41 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
ఎవరు అభివృద్ధి నిరోధకులు?
సొమ వారం, జనవరి 04, 2010 , 11:42 [IST]

mavoistsన్యూఢిల్లీ,  జనవరి 3 : మావోయిస్టుల  విధ్వంసకాండపై  విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మావోయిస్టులు ముఖ్యమైన మౌలికసదుపాయాలను ధ్వంసం చేయడం గురించి జాతీయ, ప్రాంతీయ వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మీడియా  సహాయంతో ప్రచార యుద్ధాన్ని ప్రారంభించింది.

మావోయిస్టుల విచ్ఛిన్నకర కార్యకలాపాలలో ధ్వం సమైన వంతెన, రైల్వేవ్యాగన్ల ఫోటోలను ఈ ప్రకటనల్లో ప్రముఖంగా పొందుపరుస్తున్నారు. 2009లో మావోయిస్టులు ధ్వంసం చేసిన సెల్‌ఫోన్‌ టవర్లు,  పాఠశాల భవనాలు, రైల్వే ఆస్తులకు సంబంధించిన  పూర్తి  వివరాలను ప్రకటనల్లో పేర్కొంటున్నారు. నక్సల్స్‌ దురాగతాల వల్ల ప్రజలు, సమాజంపై పడుతున్న ప్రభావాన్ని ప్రకటనల రూపంలో ప్రముఖంగా ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

  'అభివృద్ధికి ఎవరు వ్యతిరేకులు? అంటూ ప్రజలను నేరుగా ప్రశ్నిస్తూ ఈ ప్రకటనలు ఉంటున్నాయి. మావోయిస్టులను ఏకా కుల్ని  చేసే  ఉద్దేశంతో  ప్రభుత్వం  ఈ ప్రచారం చేస్తున్నది. 2009లో 39 రైల్వే ఆస్తులను,  53 టెలిఫోన్‌ టవర్లను, 20 పంచాయితీ భవనాలను, 47 పాఠశాల భవనాలను, 121 అటవీ భవనాలను,  రోడ్లు,  కల్వర్టులను  ధ్వంసం చేసినట్లు ఆ ప్రకటనల్లో పేర్కొన్నారు.  మావోయిస్టులకు  వ్యతిరేకంగా  కేంద్ర  ప్రభుత్వం మూడు జాతీయ, పలు ప్రాంతీయ వార్తాపత్రికల్లో (నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాల్లో) ఈ రకంగా ప్రకటనలు ఇవ్వడం ఇదే మొదటిసారి. నక్సల్స్‌పై ముప్పేట దాడి చేయడానికి, వారి ఆగడాల వల్ల వాటిల్లు తున్న నష్టాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలన్న ప్రభుత్వ భారీ ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం నడుస్తున్నది.

'చాలామందికి మావోయిస్టుల సిద్ధాంతాల పట్ల నమ్మకం ఉండటంతో వారి నిజస్వరూపాన్ని మేం ప్రజల ముందుంచాలనుకుంటున్నాం అని హోంమంత్రిత్వశాఖ అధికారి చెప్పారు. మావోయిస్టులు విధ్వంసకర విధానాలు అవలంబిస్తున్నప్పటికీ, వారికి గిరిజనులు, పెక్కు ప్రభావిత ప్రాంతాల్లో నిరుపేదలకు మాత్రం మద్దతునిస్తున్నారని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇటీవల పేర్కొన్నారు.'పౌర సమాజంలోని కొన్నివర్గాలు, మేధావివర్గం, యువతలో నక్సల్స్‌ ప్రభావముంది. మావోయిస్టులను అభిమానించే ప్రజలు ఇప్పటికీ ఉన్నారు అని ఆయన అన్నారు. మావోయిస్టులు కిరాతకంగా చంపేసిన ఓ నాలుగేళ్ల బాలుడి ఫోటో కూడా ప్రభుత్వ ప్రకటనల్లో చోటుచేసుకున్నది. 'నక్సల్స్‌ హింసాకాండలో మరణించిన ఈ అమాయకుల వైపు చూడండి. మావోయిస్టులు నర హంతకులు అనే శీర్షికతో ఈ ప్రకటనలు ఇచ్చారు.

లాల్‌గడ్‌ నక్సల్స్‌ హింసాకాండలో 100మంది మృతి : కేంద్రం ఆందోళన
2009లో గత మూడునెలల్లో లాల్‌గఢ్‌ జాగరణ్‌ ప్రాంతంలో మావోయిస్టుల చేతుల్లో దాదాపు 100మంది మరణించడంపై కేంద్రం ఆందోళన చెందుతున్నట్లు హోంమంత్రిత్వశాఖ పేర్కొంది. తగినంత పారామిలటరీ బలగాలు ఉన్నప్పటికీ, తీవ్రవాదులను అదుపు చేయడంలో పశ్చిమ బెంగాల్‌  ప్రభుత్వం విఫలమైనట్లు కనపడుతున్నదని హోంమంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లాలోని 150కిలోమీటర్ల మేరకు విస్తరించిఉన్న ప్రాంతంలో మావోయిస్టుల కిరాతకాలకు మరణించినవారిలో పెక్కుమంది పాలక వామపక్ష కూటమి కార్యకర్తలేనని, మృతుల్లో పోలీసులుకూడా ఉన్నారని, అమాయకులైన గ్రామస్తులను కూడా 'పోలీస్‌ ఇన్ఫార్మర్లుగా ముద్రవేసి మావోయిస్టులు హతమార్చారని అధికా రులు వివరించారు. 

బెంగాల్‌లో ముగ్గురిని పొట్టనబెట్టుకున్న మావోయిస్టులు
కోల్‌కతా : పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లాలో మావోయిస్టులుగా అనుమానిస్తున్న వ్యక్తులు ఇద్దరు సోదరులు సహా ముగ్గురు వ్యక్తులను పొట్టనబెట్టుకున్నట్లు పోలీసులు ఇక్కడ తెలిపారు. మావోయిస్టులుగా అనుమానిస్తున్న దాదాపు 40మంది ఆదివారం రాత్రి బెల్‌పహారిలోని శ్యామ్‌నగర్‌ గ్రామంలో అనంత్‌సింగ్‌ (40), సీతేశ్వర్‌సింగ్‌ (35) ఇళ్లల్లోకి చొరపడి, వారి తలలను తెగ్గోశారని పోలీసులు చెప్పారు. మరో సంఘటనలో లాల్‌గఢ్‌లోని బమల్‌ గ్రామంలో సిపిఎం కార్యకర్త ఝంటు పాత్రాను మావోయిస్టులు కాల్చిచంపినట్లు వారు పేర్కొన్నారు. దీనితో గత నెలరోజుల్లో మావోయిస్టుల చేతుల్లో మరణించినవారి సంఖ్య 65కు పెరిగింది.

 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 పరిహారంలోనూ పరిహాసం!
 మహిళా లోకానికి శుభాకాంక్షలు
 చల్లని కబురు
 లేచింది మహిళా లోకం దద్దరిల్లింది..
 ముగ్గురు రైతుల ఆత్మహత్యలు
 పర్యటన జయప్రదం
 వద్దన్నవారూ వస్తారు
 థర్డ్‌ జనరేషన్‌ (3జి) ప్రారంభించిన..
 పర్యావరణ మార్పులతో పంట నష్టం :..
 కరెంటు కోత
 
 
ముఖ్య వార్తలు
  ఐటి, పరిశ్రమల భద్రతకు..
  'ఇంటర్‌'లో 60 వేల మంది డుమ్మా
  మైనింగ్‌ మాఫియాకు సర్కార్‌ దన్ను
  ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం..
  15 లేదా 16న లోక్‌సభలో మహిళా బిల్లు
  సొంత పార్టీ నుంచి సూకీ బహిష్కరణ
  ఒఎన్‌జిసి, ఐఒసి ఐపిఒలు ఉండవు
  కొత్త హంగులతో మాక్స్‌ ఐపిఎల్‌..
  హైతీ బాధితుల సహాయార్థం లియాండర్‌..
  రుణాల వడ్డీ మాఫీపై రాష్ట్రాల పోటీ
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com