|
తిరుపతి, జనవరి 3, ప్రభాతవార్త: తిరుపతికి సమీపంలోని సి.మల్లవరం గాంధీపురం వద్ద ఆది వారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో డ్రైవ ర్‌తో సహా ఆరుమంది లక్నోవాసులు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు వున్నారు. బెంగుళూరు నుంచి తిరుపతికి వస్తున్న క్వాలిస్ ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లక్నో నుంచి తీర్థయాత్రలకు వచ్చిన ఈబృందంలో మొత్తం 11మందిఉన్నారు. రెండు కుటుంబాలకు చెందిన వారిలో ఆరుమంది మృత్యువాతపడటంతో మిగిలిన వారు దిక్కు తోచనిస్థితిలో వున్నారు. ప్రమాదం జరిగిన వెం టనే పెద్దశబ్దానికి పరిసర కాలనీ ప్రజలు అక్క డకు చేరుకునివాహనంలోఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు.
తీవ్రంగాగాయపడిన ఐదుమం దిని తిరుపతి రుయాకు తరలించారు. లక్నో గాం ధీనగర్‌లో కాపురముంటున్న సేవానంద్ పాండే స్థానికంగా వున్న ఓంశివ్‌కన్‌స్ట్రక్షన్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువు లతో కలసి దక్షిణ భారతదేశంలో తీర్థయాత్రలకు డిసెంబర్ 24 సాయంత్రం లక్నోనుంచి బయలు దేరారు. చెన్నైకు చేరుకున్న ఈ బృందం 28వ తేది ఓ ప్రైవేటు ట్రావెల్స్‌లో క్వాలిస్‌ను బాడు గకు తీసుకున్నారు. తీర్థయాత్రలు చేస్తూ జనవరి 1న మైసూరుకు చేరుకున్నారు. అక్కడ అందరూ సంతోషంగా నూతనసంవత్సర వేడుకలు జరుపు కున్నారు. శనివారం రాత్రి 12గంటలకు క్వాలి స్‌లో శ్రీవారిదర్శనార్థం బెంగుళూరు నుంచి తిరు పతికి బయలుదేరారు. వాహనం డ్రైవర్ వారం రోజులుగా అవిశ్రాంతంగా వాహనాన్ని నడప డంతో ఆదివారం ఉదయం తిరుపతి సమీపం లోని 150 బైపాస్‌పై సి.మల్లవరం గాంధీపురం వద్దకు రాగానే నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీ కొన్నాడు. దీంతో క్వాలిస్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. డ్రైవర్ రాజేష ్(27)తో పాటు ముందుసీట్లో కూర్చున్న సేవా నంద్ పాండే(45), భార్య మీరాపాండే (40), అరవింద్(11), రిద్దీ (07), సునీల్‌తివారీ (50), ఖుష్బూ ´(21)లు అక్కడికక్కడే దుర్మరణం చెం దారు. తీవ్రంగా గాయపడినప్రియ(45), పూనం (23), సుమీత్(21), సన్నీపాండే(17), బ్యూటీ (13) రుయాలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలియగానే అడ్మిన్ ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి, తిరుపతి ఆర్డీవో ప్రసాద్, డిఎస్పీ గంగరాజు, రూరల్ సిఐ సుబ్బన్న, తహశీల్ధార్ కనకనరసారెడ్డి సంఘటనాస్థలికి, రుయాకు చేరు కుని మృతుల కుటంబ సభ్యులను పరామర్శిం చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|