మార్చిన వార్తా విశేషాలు - ఆది వారం మార్చి   14th 2010 - 2:01 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
నేడు సీమాంధ్ర బంద్‌
సొమ వారం, జనవరి 04, 2010 , 11:28 [IST]

సమైక్యాంధ్ర కోసం స్వచ్ఛందంగానే ముందుకు
ఢిల్లీ చర్చలకు సమాయాత్తం
ఒక్కటైన అన్నిపార్టీల నేతలు
ఎన్నారైల ప్రోత్సాహం
ప్రభాతవార్త ప్రతినిధి-విజయవాడ:
సమైక్యాంధ్రా నినాదాన్ని ఢిల్లీలోహోరెత్తేలాచేయాలని సమైక్యాం ధ్ర పరిరక్షణ సమితి నిర్ణయించింది. ఈనెల 5న ఢిల్లీలోజరిగే చర్చల్లో సైమక్యాంధ్రాకు అనుకూలంగా కేంద్రం ప్రకటనచేసేలా వత్తిడితేవడానికి పార్టీ రహి తంగా సీమాంధ్ర నేతలు ప్రతినబూనారు.దీన్లో భాగంగా సీమాంధ్రా నుంచి పెద్ద ఎత్తున ఢిల్లీకి ప్రతి నిధులు తరలివెళ్లాలని నిర్ణయించారు. ఈలోగానే సీమాంధ్రా ఉద్యమాన్ని తీవ్రం చేయడం,అందరం కలిసి ఉండేందుకే ప్రజలు సిద్ధంగా ఉదన్నారనే వాదనకు బలంచేకూరేలా చూసేందుకు ఐక్యకార్యా చరణ సమితి వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తోంది.

సోమవారం నాడు సీమాంధ్రా బంద్‌నువిజయవంతంచేసేందుకు ఆదివారం నుంచే ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛందంగానే ఈ బంద్‌ను పాటించేందకు అన్ని స్థాయిల్లోనూ సానుకూలత వ్యక్తంఅయింది.ఆర్టీసీబస్‌లను నిలుపుదల చేస్తు న్నట్లు ప్రకటించింది. విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు సైతం బంద్‌లో పాల్గొం టున్నాయి.
ఢిల్లీలో సమైక్యాంధ్రాకు అనుకూలంగా ప్రకటన రాకపోతే తాడోపేడో తేల్చుకోవానికి అందరూ సంసిద్ధంకావాలనిపరిరక్షణసమితి ప్రకటించింది. తెలంగాణాలో జరిగే పోరాటానికి దీటుగా కార్యా క్రమాలు రూపొందించాలని, అన్ని వర్గాలనూ ఉద్య మంలో పాల్గొనేలా చేసి, ఉద్యమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు.

దీన్లో భాగంగానే విద్యార్థులను ఎక్కువ మందిని రంగంలోకి దిం పాలని సమితి వ్యూహంగా ఉంది. వివిధ ట్రేడ్‌యూ నియన్లు,మహిళా సంఘాలను తెరమీదకు తీసు కొస్తే ఉద్యమం సగభాగం విజయవంతం అయిన ట్లేనని భావిస్తోంది. అయితే వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించకుండా ఉద్యమాన్ని నిర్వహించాలని, శాంతియుతంగానే కొనసాగించానలి కూడా సమితి నిర్ణయించింది. బంద్‌లు,రాస్తారోకోలు,రైల్‌రోకోలు వంటి వాటి ద్వారా ఉద్యమాన్ని పూర్తిస్థాయిల నిర్వహించడం వల్ల సమైక్యాంధ్రా ఉద్యమం మరింతగా బలపడుతుందని భావిస్తున్నారు. సైమక్యాంధ్రా ఉద్యమంలోకి ఎన్నా రైలు, హైదరాబాద్‌లో స్థిరపడిన ప్రముఖలు తెరవెనుక ఉండి
 ప్రోత్సహిస్తున్నారు. ఢిల్లీ చర్చలకు పెద్దఎత్తున తరలేందుకు కూడా ఈ శక్తులు వ్యూహాత్మకంగానే కార్యాచరణకు రంగంసిద్ధం చేస్తోంది.

ఎన్నారైల్లో ఎక్కువమంది సీమాంధ్రాకు చెందిన ప్రముఖులే ఉన్నారు.వీరంతా ఇపుడు సమైకాంధ్రాకు మద్దతుగా నిలిచేందుకు సంసిద్దత తెలిపారు. దీనిపై సైమ క్యాంధ్రా నేతలు ఇప్పటికే వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారిని సంప్రదిం చడం,వారి నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించిన నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపేందుకు రంగం సిద్దమయింది. అదే విధంగా హైదరాబాద్‌లో స్థిరపడిన తెలుగువారు కూడా సమైక్యాంధ్రా ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణా ఉద్యమకారుల వల్ల తీవ్ర భయాందోళనలు చెందుతోన్న వారు సమైక్యాంధ్రా ఉద్యమానికి భరోసా ఇస్తున్నారు.సీమాంధ్రా బంద్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే అప్రమత్తత చోటుచేసుకుంది. పోలీస్‌ యంత్రాంగం నిబంధనలు అమలు చేయడాన్ని ఆదివారం రాత్రే ఆరంభించింది.

అయితే నాయ కులు కూడా విధ్వంసాలకు పాల్పడకుండా,శాంతియుతంగానే బంద్‌ నిర్వహిం చాలని కోరుకోవడం విశేషం. సమైక్యాంధ్రా సాధిస్తామని,దీనికోసం ఎంతవరకైనా పోరాడతామని కార్యాచరణ సమితి నాయకులు చేసిన ప్రకటనకు రోజురోజుకూ బలం చేకూరుతోంది. ఇది నిజం చేసుకునే దిశగా వేసే అడుగులు మరింతగా గట్టి పడుతున్నాయి.సోమవారం నాటి బంద్‌తో పాటు, మంగళవారం నాడు రైల్‌రోకో నిర్వహించాలని కూడా సమితి నిర్ణయం తీసుకుంది. విజయవాడ నగ రం నుంచి ఒక్కరైలును కూడా బయటికి కదలనీయకుండా చేయాలని ప్రకటిం చారు. దీంతో వందలాది రైళ్లు నిలిచి పోయే ప్రమాదం ఉంది. ఈమేరకు దక్షిణ మధ్య రైలు అధికారులతో ఉద్యమకారులు చర్చలు జరుపుతున్నారు. తమ ఉద్యమానికి ఆర్టీసీ సహకరించిన విధంగానే రైల్వేశాఖ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైల్లే శాఖ కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 హైదరాబాద్‌ నుంచి విశాఖకు ఎఫ్లూ..
 సిపిపి కోశాధికారిగా..
 జమునకు ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం
 పరిహారంలోనూ పరిహాసం!
 మహిళా లోకానికి శుభాకాంక్షలు
 చల్లని కబురు
 లేచింది మహిళా లోకం దద్దరిల్లింది..
 ముగ్గురు రైతుల ఆత్మహత్యలు
 పర్యటన జయప్రదం
 వద్దన్నవారూ వస్తారు
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com