| ఫెడరేషన్ కప్ విజేత ఈస్ట్ బెంగాల్ |
| సొమ వారం, జనవరి 04, 2010 , 3:54 [IST] |
 |
|
గౌహతి, జనవరి 3 : గౌహతిలోని నెహ్రూ స్టేడియంలో ఆదివారం ఫైనల్లో తలపడిన లజాంగ్ జట్టుపై పెనాల్టీల ద్వారా 3-0 స్కోరుతో గెలవడంతో ఈస్ట్ బెంగాల్ జట్టు తన ఆరవ ఫెడరేషన్ కప్ టైటిల్‌ను సాధించుకుంది. భారతీయ ఫుట్‌బాల్ పెద్ద ఆటగాళ్లను 120 నిముషాల పాటు గోల్ చేయకుండా కొత్తగా వచ్చిన లజాంగ్ జట్టు కట్టడి చేయగలిగింది. లజాంగ్ జట్టుకు చెందిన అనిల్ గురుంగ్, సామ్సన్ రామెంగ్మావియా, కిర్షన్ లిగ్‌షింగ్‌లు స్పాట్ కిక్‌లను గోల్‌లుగా మార్చడంలో విఫలం అయ్యారు.
ఈస్ట్ బెంగాల్‌కు చెందిన యూసుఫ్ యాకుబ్, నిర్మల్ చెత్రి, సంజు ప్రధాన్‌లు షూటవుట్‌లో తమ లక్ష్యాలను సాధించడంతో ఈస్ట్ బెంగాల్ ఫెడరేషన్ కప్‌ను గెలుచుకుంది. ఈ పోటీలో ఈస్ట్ బెంగాల్ విజయం సాధించడంతో ఉపఖండంలో రెండవ తరగతి క్లబ్ పోటీ అయిన ఎఎఫ్‌సి కప్‌కు క్వాలిఫై అయింది.
|
|
|
|
|
|
|