| తన భార్య ఎలిన్‌కు 30 కోట్ల డాలర్లను ఇచ్చిన వుడ్స్ |
| సొమ వారం, జనవరి 04, 2010 , 3:52 [IST] |
 |
|
లండన్, జనవరి 3 : విడిపోవాలనుకున్న తన భార్య ఎలిన్ నోర్డ్డెగ్రెన్‌కు క్రిస్‌మస్ బహుమతిగా 30 కోట్ల డాలర్లను టైగర్ వుడ్స్ ఇచ్చాడని సమాచారం. పద్దెనిమిది మంది మహిళలతో సంబంధం కలిగి ఉన్నాడనే ఆరోపణతో విడాకులతో పాటు ఆస్థిలో సగాన్ని కోరిన ఇద్దరు పిల్లల తల్లి అయిన అతని భార్య కోరింది. ఈ అవమానభారంతో అప్పటి నుంచి గోల్ఫ్ నుంచి వుడ్స్ తప్పుకున్నాడు. టైగర్‌తో విడిపోవడానికి నూరు శాతం నిర్ణయంతో ఆమె సిద్ధంగా ఉందని సమాచారం.
30 కోట్ల డాలర్ల క్రిస్‌మస్ బహుమతిని అందుకున్న ఆమె సంతోషాన్ని చూసిన వారికి తన జీవితంలో ముందుకెళ్ళడంలో అందరి దృష్టి ని ఆకర్షించిందని అన్నారు. తన పిల్లల తండ్రిగా ఆమెకు ఇంకా టైగర్‌పై అభిమానం ఉందని, కానీ ఆమె ప్రయత్నమంతా పిల్లలను సౌకర్యవంతమైన ఇంటిలో ఉంచి, వారికి కావలసిన అవసరాలు తీర్చడమేనని, అందుకు టైగర్ కూడా అంగీకరించాడని అభిజ్ఞవర్గాల భోగట్టా.
|
|
|
|
|
|
|