|
న్యూఢిల్లీ, డిసెంబరు19, ప్రభాతవార్త: సమైఖ్యాం ధ్రపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు రాజీనామాలు విరమించేది లేదని రాయల సీమ హక్కుల వేదిక కన్వీనర్, ఎంఎల్‌ఏ టి.జి. వెంకటేష్ చెప్పారు. శనివారం న్యూఢిల్లీలో విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైఖ్య నినాదాలపై కేంద్రం మరింత దృష్టిని సారించా లన్నారు. ఇది ప్రజల నుంచి వచ్చిన ఉద్యమమే తప్ప నేతలు నడుపుతున్న ఉద్యమం కాదని పేర్కొన్నారు. సమైఖ్యాంధ్ర తరపున హస్తినలో గట్టిగా వాదనలు వినిపించే బాధ్యత ఎంపీలదేనని స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీ లగడపాటి
రాజ్‌గోపాల్ నిరాహారదీక్ష చేయటం కంటే ఢిల్లీలోనే ఉండి అధిష్టానంపై వత్తిడి తెస్తే ప్రయోజనం ఉండేదన్నారు. అసెంబ్లీ తీర్మానం ఆమోదం లేకుండా పార్లమెంటులో బిల్లు పెట్టబోమని కాంగ్రెస్ పార్టీతో పాటు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీకూడా స్పష్టం చేసిన తర్వాత ఇక ఆందోళనలు అవసరం లేదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెజార్టీ ఎంఎల్‌ఏలు ఆంధ్రా, రాయలనుంచే ఉన్నందున కేవలం తెలంగాణ వారి ఓటుతో తీర్మానం ఆమో దం పొందదన్నారు. కేంద్రం మళ్లీ అఃలపక్షం ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంఎల్‌ఏలు, ఎంపీలు, నేతల అభిప్రాయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అదే తాము కాంగ్రెస్ కోర్‌కమిటీ సభ్యులకు సూచించామన్నారు.
|