| ఎన్‌డిఎలోచేరనున్న ఉమాభారతి? |
| ఆది వారం, డిసెంబర్ 20, 2009 , 7:10 [IST] |
 |
|
న్యూఢిల్లీ :రాజకీయ అవసరాల కారణంగా తాను ఎన్‌డిఎలోచేరుతున్నట్లు భారతీయ జనశక్తి పార్టీ నాయకురాలు ఉమాభారతి తెలిపారు. కానీ తాను బిజెపిలో చేరే ప్రసక్తి లేదని ఆమె అన్నా రు. ఆ పార్టీలో చేరితే ఒబిసి మహిళల రిజర్వేషన్ వంటి అంశాలను లేవనెత్తడం సాధ్యంకాదని ఆమె చెప్పారు. రాజకీయ అవసరాల మూలంగా ఎన్‌డిఎలో చేరుతున్నట్లు ఆమె తెలిపారు.
తాను ఈమధ్యనే అద్వానీని కలిసి బిజెఎస్ ఎన్‌డిఎలో చేరడం గురించి చర్చించానని ఆమె చెప్పారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నికచేయడంలో బిజెపి తలమునకలై ఉందని,బిజెఎస్,ఎన్‌డిఎలో చేరడం పై బిజెపి నూతన అధ్యక్షుడే ఒక నిర్ణయం తీసుకొంటారని ఆయన చెప్పినట్లు ఆమె అన్నారు.
|
|
|
|
|
|
|