| లోక్‌సభలో మహిళా శకం |
| ఆది వారం, డిసెంబర్ 20, 2009 , 7:08 [IST] |
 |
|
న్యూఢిల్లీ : లోక్‌సభలో మహిళా శకం ప్రారంభమైంది. సుష్మాస్వరాజ్ ప్రతిపక్ష నాయకురాలిగా నియమితులయ్యారు.తొలిసారిగా పార్లమెంట్‌లో మూడుప్రధాన స్థానాల్లో మహిళలే ఉన్నారు. మీ రా కుమార్ లోక్‌సభ స్పీకర్‌గా ఉండగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీఉన్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఈ సారే లోక్‌సభలో మహిళ సంఖ్య ఎక్కువగా ఉంది.ప్రస్తుత లోక్‌సభలో 50 మంది మహిళా ఎంపిలున్నారు. వీరిలో 23 మంది కాంగ్రెస్ ఎంపిలు కాగా 13 మంది బిజెపి ఎంపిలు.తృణమూల్ కాంగ్రెస్,ఎస్పీ,బిఎస్పీలకుచెందిన నలు గురు మహిళా ఎంపీలు లోక్‌సభలో ఉన్నారు. 1990 లో సోనియాగాంధీ తొలిసారిగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు.
|
|
|
|
|
|
|