| బిజెపి అధ్యక్షునిగా గడ్కారి |
| ఆది వారం, డిసెంబర్ 20, 2009 , 7:07 [IST] |
 |
|
న్యూఢిల్లీ,డిసెంబర్ 19 :రాజ్‌నాథ్ సింగ్ స్థానంలో యాభైరెండేళ్ళ నితిన్ గడ్కారి శనివారం బిజెపి అధ్యక్షునిగా నియమితులయ్యారు. బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో గడ్కారీని పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకొన్నారు. ఈ సమావేశానికి బిజెపి నాయకులు ఎల్.కె.అద్వాని,రాజ్‌నాథ్‌సిం గ్, సుష్మా స్వరాజ్,అరుణ్‌జైట్లీ తో పాటు ఇతర నాయకులు హాజరయ్యారు.
మహారాష్ట్రకు చెందిన ఒక బిజెపి నాయకుడు పార్టీ అధ్యక్షునిగా పదవీబాధ్యతలు స్వీకరించడం ఇదే మొదటిసారి.పేదల బతుకుల్లో మార్పుతెచ్చేందుకు సాంఘి క,ఆర్థిక సంస్కరణలకు రాజకీయాలు ఒక సాధనమని గడ్కారి అన్నారు. స్వప్రయోజనాల కోసం కాకుండా బీదల కోసం తాను పనిచేస్తానని ఆయన చెప్పారు.
|
|
|
|
|
|
|