విశాఖపట్నం డిసెంబర్ 19 ప్రభాతవార్త : సోనియా గాంధీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదని పిఆర్‌పి నేత చిరంజీవి సూచించారు. ప్రజల అభీష్టం మేరకు నాయకులు తలవంచక తప్పదన్నారు. ఈ ప్రజా ఉద్యమానికి సేవకుడినై, సైనికుడిగా తుది వరకు పోరాడుతానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయని పిఆర్‌పి నేత చిరంజీవి స్పష్టం చేశారు. శనివారం ఆయన విశాఖలో మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ రాజకీయ సంక్షోభాన్ని ఎవరు ఊహించలేదన్నారు. ఓ చారిత్రక నిర్ణయం తీసుకునే ముందు విధి విధా నాలను సక్రమంగా అమలు చేయాలని, లేని పక్షం లో ఈ తరహా పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుం దన్నారు. వేర్పాటు వాదానికి ప్రజలు భయపడిపో తున్నారన్నారు.
భవిష్యత్ అగమ్యగోచరమనే ఉద్దేశంతోనే సమైక్యవాదాన్ని కోరుకునే ప్రజలం దరూ స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అందరూ కలిసికట్టుగా ఉండాలన్న ప్రజల అభీష్టాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. చిన్న రాష్ట్రాల వలన పరిపాలనా సౌలభ్యం ఉంటుందన్న వాదాన్ని రాష్ట్ర ప్రజలు వినే పరిస్థితిలో లేరన్నారు. ప్రపంచీ కరణ నేపథ్యంలో వేర్పాటు వాదానికి తావ్ఞలేదన్నది ప్రస్తుతం ప్రజలు నిరూపిస్తున్నారన్నారు.
నాయ కుల వెనుక ప్రజలు ఉంటారన్న అంశాన్ని పక్కన పెట్టి, ప్రజల వెనుక నాయకులు కదలాల్సిన పరి స్థితి నెలకొందన్నారు. ఇది ప్రేరిపిత ఉద్యమం కాదని, సమైక్యాంధ్ర కోసం ఫలితం దక్కేవరకు ఆపడం ఎవరి తరమూ కాదని ఆయన స్పష్టం చేశారు. వేర్పాటును ప్రోత్సహిస్తే, అది తెలంగాణ, ఆంధ్రాతో ఆగదని, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలం గాణ, ఉత్తరాంధ్ర, గ్రేటర్ హైదరాబాద్ ఇలా రాష్ట్రం ఛిన్నాభిన్నం అయ్యే పరిస్థితి దాపురిస్తుందన్నారు. ప్రజల అభీష్టం మేరకు సోనియాగాంధీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవలసిన అవసరం ఏర్ప డిందన్నారు.
తర్వాత ఆయన విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇదే రోజు ఉదయం ఆయన నగరంలో నిరాహారదీక్షలు నిర్వ హిస్తున్న శిబిరాలను సందర్శించి తన సంఘీ భావా న్ని ప్రకటించారు. కెజి ఆసుపత్రిలో నిరాహారదీక్ష నిర్వహిస్తున్న విద్యార్థులను పరామర్శించారు. ఆరో గ్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు నచ్చచెప్ప డంతోవారు వైద్యంతీసుకునేందుకు అంగీకరించారు.
కెసిఆర్ రెచ్చకొట్టకు సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేసేవారు డబ్బులు తీసుకుని చేస్తున్నారని కొందరు ఆరోపించడం సబ బు కాదని చిరంజీవి అన్నారు. సమైక్యాంధ్ర ఉద్య మంలో భాగంగా విశాఖపట్నంలోని విమానాశ్ర యంలో తన అభిమానులు, ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. ఇటీవల కెసిఆర్ సమైకాంధ్ర ఉద్యమం పై చేసిన ఆరోపణలను చిరంజీవి తీవ్రంగా ఖం డించారు. ఇటువంటి ప్రకటనలతో ప్రజలను రెచ్చకొ ట్టవద్దని పరోక్షంగా కెసిఆర్‌కు హితవు పలికారు.