మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
సక్సెస్‌ స్కూళ్లలో సిలబస్‌ మార్పుపై ఆలోచించండి: రోశయ్య
ఆది వారం, డిసెంబర్ 20, 2009 , 2:22 [IST]

rosaiahహైదరాబాద్‌, డిసెంబర్‌ 19 ప్రభాతవార్త: సక్సెస్‌ స్కూళ్లలో సిబిఎస్‌ఇ సిలబస్‌ మార్పు, చేర్పులపై రాష్ట్రంలోని ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులు, విద్యారంగ అనుభవజ్ఞుల నుంచి అభిప్రాయాలు, సలహాలను స్వీకరించి, తదనుగుణంగా విద్యా ర్థులకు ప్రయోజనం కలిగించే విధానాన్ని ఖరారు చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను ము ఖ్యమంత్రి కె. రోశయ్య ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో  మాధ్య మిక విద్యాశాఖమంత్రి, అధికారులతో నిర్వహిం చిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సక్సెస్‌ స్కూళ్లలో ప్రస్తుతం అమలు చేస్తున్న సిబిఎస్‌ఇ సిలబస్‌ మార్పుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉపాధ్యా య సంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి కూడా అభిప్రాయాలు, సూచనలు తీసుకోవాలన్నారు.

ఆతర్వాతే సిలబస్‌ మార్పులు అందరికి అమోదయోగ్యమైన, విద్యా ర్థుల భవిష్యత్‌కు దోహదపడే నిర్ణయాన్ని తీసు కోవాలని సిఎం సూచించారు. సక్సెస్‌ సూళ్లను మరింతగా పటిష్టం చేసేందుకు, సిలబస్‌, బోధ నలో మార్పులు,చేర్పులపై ఎన్‌సిఇఆర్‌టి ఇచ్చిన సూచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నా రు. ప్రస్తుతం రాష్ట్రంలో 6500 సక్సెస్‌ స్కూళ ్లలో అమలు చేస్తున్న ఇంగ్లీష్‌ మీడియంను మరో 2 వేల స్కూళ్లలో కూడా ప్రవేశపెట్టాలని ముఖ్య మంత్రి సూచించారు.  ఈమేరకు ఈస్కూళ్ల మరింత పటిష్టంగా చేసేందుకు ఎస్‌ఇఆర్‌టి ప్రతి పాదనలపై చర్చించి అమలు చేయాలని రోశయ్య పేర్కొన్నారు.

ఈసమావేశానికి హాజరైన మంత్రి మాణిక్య వర ప్రసాద్‌  స్టేట్‌ సిలబస్‌లో విద్యార్థులకు ముందు కార్పొరేట్‌ విద్య స్థాయికి అందుకునేందుకు కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని సిబిఎస్‌ఇ సిల బస్‌ లోని మంచి అంశాలతో సరిచేయాలని అభిప్రాయపడ్డారు. అయితే సిఎం ఆదేశాల మేర కు రాష్ట్రంలోని ప్రముఖ విద్యావేత్తలు, విద్యారంగ నిపుణులతో దీనిపై చర్చించి, వారి సూచనల మేరకు తుది నిర్ణయం ఖరారు చేస్తా మని ఆయన పేర్కొన్నారు.

ఈసమావేశంలో పాల్గొన్న పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఈస్కూళ్లలో సిబిఎస్‌ఇ సిలబస్‌ను బోధించేందుకు టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని, ఎందుకంటే ఇంగ్లీస్‌ మీడియంలో ఉండే ఈసిలబస్‌ విద్యార్థులకు కూడా సరిగా అవగాహన కావటంలేదన్నారు. అంతేకాక ఈసిలబస్‌కు సంబంధించిన శిక్షణ, రిఫరెన్స్‌ బుక్స్‌ కూడా అందుబాటులే లేవన్నారు. టీచర్లకు తగు శిక్షణ కూడా ఇవ్వలేద ని వారు పేర్కొన్నారు. అయితే స్టేట్‌ సిలబస్‌లో ఇంగ్లీష్‌ మీడియంలో 1వ తరగతి నుంచి బోధన చేస్తే విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వారు ముఖ్యమంత్రికి సూచించారు. ఈసమావేశంలో ప్రాధమిక విద్యాశాఖ మంత్రి అహ్మదుల్లా, పాఠశాల విద్యాశాఖ  ముఖ్యకార్య దర్శి సురేష్‌చంద, కమిషనర్‌ పూనం మాలకొం డయ్య, కార్యదర్శి జెసి శర్మ, ఆర్థికశాఖ కార్య దర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్‌ ఏసు పాదం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 'ఓదార్పు' నిజాయితీని గుర్తించారు
 కష్టాలు అధిగమించడమే నా సక్సెస్
 సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
 ఒయులో అసలేం జరిగిందంటే
 జగన్‌కు సోనియా ఝలక్‌
 రాజకీయాలు పూల బాటకాదు, ముళ్లబాట..
 పోలీస్‌ చమత్కారం?
 డాక్టర్‌ గిరీష్‌ సంఘీకి సిఎం..
 పిహెచ్‌డి విద్యార్థులతో పాఠాలు
 కార్యదీక్ష, దృఢ సంకల్పం వైశ్యుల..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com