| రేపటినుంచి కెసిఆర్ బస్ యాత్ర |
| ఆది వారం, డిసెంబర్ 20, 2009 , 2:07 [IST] |
 |
|
నేడు టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో భేటీ హైదరాబాద్, డిసెంబర్ 19,ప్రభాతవార్త : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు 21వ తేది సోమవారం నుంచి బస్సు యాత్రను ప్రారం భించనున్నారు.తెలంగాణలోని పది జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటిం చేందుకు కార్యాచరణను రూపొందించారు. ఆదివారం జరగనున్న టిఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ పర్యటనను అధికారికంగా ఖరారు చేయను న్నారు. రూట్‌మ్యాప్, సభల నిర్వహణ వంటి అంశాలను పొలిట్‌బ్యూరో సమా వేశంలో నిర్ణయించనున్నారు.
మెదక్ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుం ది. ఆరోగ్యపరంగా కెసిఆర్ ఇంకా పూర్తిగా కోలుకోనందున బస్సు యాత్ర వద్దని వైద్యులు, కుటుంబ సభ్యులు కోరినప్పటికీ ఆయన అంగీకరించడం లేదని తెల సింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయంగా తేలిపోయిందని, ప్రజలను కలుసు కుని, వారిని మరింత చైతన్యవంతులుగా చేయడానికి కెసిఆర్ బస్సు యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఒక రకంగా ముందస్తు విజయ యాత్రగా పార్టీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
|
|
|
|
|
|
|