మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
ఉచిత లడ్డూ రద్దుకు టిటిడి నిర్ణయం
ఆది వారం, డిసెంబర్ 20, 2009 , 2:06 [IST]

ttd meetingఇకపై 20 రూపాయలకు రెండు లడ్డూలు; ఆర్జిత సేవలు యధాతథం
తిరుమల, డిసెంబర్‌ 19 ప్రభాతవార్త:
రానున్న నూ తన ఏడాదికి తిరుమలకు విచ్చేసే వెంకన్న భక్తు లకు చేదు వార్త.స్వామివారిని దర్శించుకు నేం దుకు సర్వ దర్శనంలో వెళ్ళే సామాన్య భక్తులకు ఇంతకాలం ఇస్తున్న ఉచితలడ్డూను ఇకపై రద్దు చేస్తూ తీర్మానించింది.అదేస్థానంలో 10రూపా యల సబ్సిడీి ధరలో ఇస్తున్న ఒక లడ్డూకు బదు లు ఇకపై రెండు లడ్డూలను 20 రూపాయలకు ఇవ్వాలని నిర్ణయించింది.అలాగే సిఫార్సు ఉత్త రాలపై ఇస్తున్న 25 రూపాయల లడ్డూల ధరను అలాగే కొనసాగించనుంది. శనివారం తిరుమల అన్నమయ్య భవన్‌లో టిటిడి పాలక మండలి సమావేశం జరిగింది. ఈమేరకు నిర్ణయాలను చైర్మన్‌ డికె.ఆదికేశవులునాయుడు, టిటిడి కార్య నిర్వహణాధికారి ఐవైఆర్‌.కృష్ణారావులు మీడియా కు వెల్లడించారు.

ఇందులో ప్రధానంగా శ్రీవారి ఖజానాకు ఏటా 45 కోట్లు రూపాయల భారం అవుతున్న ఉచిత లడ్డూ పథకాన్ని రద్దు చేశారు. దర్శనానికి వెళ్ళే సామాన్య భక్తులకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఇంతకాలం 175 గ్రాముల బరు వుగల లడ్డూను పొందేందుకు టోకెన్‌ ఒకటి ఉచి తంగా ఇచ్చేవారు. అదే బరువుగల లడ్డూను 10 రూపాయల వంతున పొందేందుకు మరొక్క టో కెన్‌ను భక్తులకు ఇచ్చేవారు. ఈ విధానంలో రోజ కు 45 వేల లడ్డూలను భక్తులు  ఉచితంగా పొం దేవారు. అదనంగా లడ్డూలు కావాలనుకునేవారు టిటిడి అధికారుల ప్రత్యేక అనుమతితో ఒక్కో లడ్డూను 25 రూపాయల వంతున కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఈఉచిత లడ్డూ పథకంలో అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు టిటిడి విజిలెన్స్‌విభాగం నివేదిక ఇచ్చింది. ఇందు లో  ఉచిత లడ్డూలు భక్తులకంటే భోక్తలకే ఎక్కు వగా ఉపయోగపడుతున్నట్లు నిగు ్గతేల్చింది.

ఎక్కువగా పోలీసులు,టిటిడి ఉద్యోగులు, ఇత రత్రా దళారులు ఈ టోకెన్లును పొందుతూ దుర్వి నియోగం చేస్తున్నారనే విమర్శలు చాలాకాలంగా ఉన్నవే. అంతేకాకుండా ఆలయంలో స్వామివారి ప్రసాదంగా చిన్న లడ్డూను భక్తులకు ఇస్తున్నారు. చక్కెరపొంగలిని ఆలయంలోనేకాకుండా టిటిడి నిత్యాన్నదానంలోనూ వడ్డిస్తున్నారు. ఈనేపథ్యం లో  కోట్లాది రూపాయల ఆర్థిక భారం మోస్తూ ఈ ఉచిత లడ్డూ పథకాన్ని  దళారులకు ఉపయో గపడేలా కొనసాగించడంకంటే రద్దు చేయడమే మంచిదని టిటిడి పాలకమండలి ప్రకటించింది.

భద్రత కోసం 100 మెటల్‌ డిటెక్టర్లు
తిరుమల భద్రత కోసం ప్రస్తుతం వున్న ఆధునిక పరికరాలతోపాటు మరో 100 మెటల్‌ డిటెక్టర్‌ ఫ్రేములను ఏర్పాటు చేసుకోవాలని పాలక మం డలి నిర్ణయించింది. తిరుపతిలోని  అలిపిరి సెక్యూరిటీ జోన్‌నుండి తిరుమలలోని శ్రీవారి ఆలయం వరకూ  ముఖ్యమైన ప్రదేశాలలో వీటి ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. లగే జీలను స్కానింగ్‌ చేయడానికి ఏర్పాటు చేసిన స్థలాలలోనే వీటిని ఏర్పాటు చేస్తారు.

ఆర్జిత సేవలు యథాతథం
తిరుమల ఆలయంలో ఇటీవల కొంతకాలంగా సా మాన్య భక్తులకు స్వామివారి సర్వదర్శన సమ యం పెంచేందుకు అనేక మార్పులు చేపట్టిన కారణంగా ఏఏడి,సెల్లారు టిక్కెట్లు రదు ్దచేశారు. 300రూ, శీఘ్ర దర్శనాన్ని ప్రవేశపెట్టారు.  అలాగే ఆలయంలో నిత్యం జరిగే సుఫ్రభాతం, తోమాల,అర్చన, అభిషేకం లాంటి వివిధ ఆర్జిసేవలను ఏకాంతంగా నిర్వహించి, సహస్ర కళశాభిషేకం సేవను ఏడాదికోసారికి పరిమితం చేసే, ప్రతిపాదనలపై పాలక మండలి సమా లోచనలు జరిపింది. దీనిపై  సబ్‌కమిటి ప్రతిపా దనలపై సుదీర్ఘంగా చర్చించారు.  రాష్టప్రభు త్వంతో చర్చించాక భక్తుల మనోభావాలకు భం గం కల్గించేలా ఎటువంటి నిర్ణయాలు తీసు కోరాదని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆలయం లో ప్రస్తుతం జరుగుతున్న ఆర్జితసేవలను యథాతథంగా కొనసాగించాని తీర్మానించారు.

మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు
తిరుమలలో శ్రీవారి చెంత వివాహాలు చేసు కోవాలనుకునే భక్తుల కోసం కల్యాణ మండపం నిర్మిస్తారు. అందులోనే భక్తులకు భోజనం, బస వసతితో పాటు అన్ని సౌకర్యాలు వుండేలాగా ఆధునిక రీతిలో నిర్మిస్తారు.తిరుమలకు నడకదారులలో  పారిశుద్ధ్యం మెరు గుకు పనులను అవుట్‌ సోర్సింగ్‌కు అప్పగిస్తారు.తిరుపతిలోని టిటిడి శ్రీవెంకటేశ్వరా మ్యూజిక్‌ కాలేజి స్వర్ణోత్సవాలను  వచ్చేఏడాది జనవరి 5 నుండి 9 వతేదీ వరకూ ఘనంగా నిర్వహిస్తారు.

రానున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలకు విచ్చేసే భక్తుల శ్రేయస్సు దృష్టా సమైక్యాంధ్ర కోసం టిటిడి ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలను విరమించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి.ఈ సమావేశంలో ఎక్స్‌అఫీషియో సభ్యులు రెవి న్యూ ప్రిన్సిపల్‌ కార్యదర్శి కె.వి.రమణాచారి, కమిషనర్‌ సుందరకుమార్‌, పాలక మండలి సభ్యులు ఇందిర,రౌతు సూర్యసూర్యప్రకాష్‌, చెరుకు ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 'ఓదార్పు' నిజాయితీని గుర్తించారు
 కష్టాలు అధిగమించడమే నా సక్సెస్
 సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
 ఒయులో అసలేం జరిగిందంటే
 జగన్‌కు సోనియా ఝలక్‌
 రాజకీయాలు పూల బాటకాదు, ముళ్లబాట..
 పోలీస్‌ చమత్కారం?
 డాక్టర్‌ గిరీష్‌ సంఘీకి సిఎం..
 పిహెచ్‌డి విద్యార్థులతో పాఠాలు
 కార్యదీక్ష, దృఢ సంకల్పం వైశ్యుల..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com