మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
సందిగ్ధంలో బాబు దిక్కుతోచని పార్టీ
ఆది వారం, డిసెంబర్ 20, 2009 , 2:30 [IST]

chandrababu naiduపత్యేక ప్రతనిధి, ప్రభాతవార్త / హైదరాబాద్‌ : రాష్ట్రం లోని ఉద్రిక్తంగా మారిన 'విభజన వివాదంపై పార్టీపరంగా తన విధాన నిర్ణయాన్ని ప్రకటించ కుండా గత పదిరోజులుగా మౌనవైఖరిని ప్రదర్శి స్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సందిగ్ధ వైఖరిపై ఆ పార్టీ నాయకులు, కేడర్‌లో అయోమయం, అసంతృప్తి నెలకొన్నది. కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అనుకూ లంగా తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ, సమై క్యాంధ్ర నినాదంతో ఆంధ్ర-రాయలసీమ ప్రాంతా లలో రాజకీయరహితంగా రగులుతున్న ఉద్య మంలో ఆ ప్రాంతానికి చెందిన టిడిపి ప్రజాప్రతి నిధులు, పార్టీ నేతలు కీలక పాత్ర వహించడం తెలంగాణ టిడిపి నేతలు, ప్రజా ప్రతినిధులకు మింగుడుపడటంలేదు.

దీంతో ఆ పార్టీ నేతలు, కేడర్‌ సీమాంధ్ర-తెలంగాణ పేరుతో రెండు వర్గా లుగా చీలిపోయారు. బయటకు వారు ఐక్యంగా ఉన్నామని ఎంత నమ్మబలుకుతున్నా, ఆయా ప్రాంతాల స్థానిక ప్రజల మనోభావాలకు లోబడి వారు మానసింగా విడిపోయా రన్నది వాస్తవం. తెలంగాణ తీర్మాణం ప్రవేశపెడితే తమ పార్టీ తరఫున మద్దతిస్తామంటూ పదేపదే చెప్పిన చంద్రబాబు, తీరా కాంగ్రెస్‌అధిష్ఠానం తెలంగాణకు సానుకూలంగా నిర్ణయం ప్రకటించిన తర్వాత హఠాత్తుగా తన వైఖరిలో స్పష్టమైనమార్పు కనిపించడాన్ని తెలంగాణ టిడిపి వరా ్గలు జీర్ణించుకోలేకపోతున్నాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఆ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యేలు, నాయకులు బయటకు మొహమాటంగా వ్యవహరిస్తు న్నా...అంతర్గతంగా చంద్రబాబు వైఖరిని విభేదిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసారు.

కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరరావు, జైపాల్‌యాదవ్‌లు తమ అసహనాన్ని బహిర్గతంచేసి, పార్టీలో చర్చ నీయాంశంగా మారారు. బాబుకు సన్నిహితంగా మెలుగుతున్న నాగం జనార్ధన రెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, రేవంత్‌రెడ్డి, తుమ్మల నాగే శ్వరరావు ప్రభృతులు కొంత మొహమాటంవల్ల బాబువైఖరిని బహిరంగంగా ఆక్షే పించలేకపోతున్నా, అంతర్గత లాబీల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు బోగట్టా. కాగా సీమాంధ్రలో సమైక్యవాదంతో ఉద్యమిస్తూ, ఆమరణ దీక్షలకు కూడా దిగి, పోరాడుతున్నా ఆపార్టీ అధినేత చంద్రబాబు తనవైఖరిపై నోరు విప్పకపోవడంపట్ల సీమాంధ్ర టిడిపినేతలు పెదవివిరుస్తున్నారు.

సమైక్యాంధ్ర-తెలంగాణ రెండు డి మాండ్లలో చంద్రబాబు దేనికీ తన సమ్మతిని తెలపకుండా స్తబ్ధతగా ఉండిపోవడం ఆ వర్గాలను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది. ఆంధ్రా-రాయలసీమ నేతలైతే సమె ౖక్యాంధ్రకోసం ఏకంగా బస్సుయాత్రను చేపట్టి, తెలంగాణ టిడిపి నేతలను మరిం త పురిగొలిపేలా చేశారు. దీంతో తెలంగాణ టిడిపి నేతలు తామేమీ తక్కువ కాదన్నట్టుగా స్థానిక ప్రజల విశ్వసనీయత పొందేదిశగా సమైక్య వాదానికి వ్యతిరేకంగా ప్రకటనలివ్వడమేకాక, ప్రత్యక్ష ఆందోళనకు కూడ సమయాత్తమవుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులన్నీ ఆచితూచి పరిశీలిస్తూ చంద్రబాబు వ్యూహా త్మకంగా వ్యవహరిస్తున్నట్లు ఆయనకు ఆయన అనుకుంటున్నప్పటికీ, ఆయన వైఖరివల్ల ఈ రెండు ప్రాంతాలలోనూ ఆపార్టీ ప్రజల విశ్వసనీయతకు క్రమక్ర మంగా దూరమవుతున్నదేమోనన్న సందేహాలను పరిశీలకులు వ్యక్తంచేస్తున్నారు.

ఈ ప్రభావంతో అటు సీమాంధ్రలోను, ఇటు తెలంగాణలో కూడా టిడిపి తన విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉండొచ్చని భావిస్తున్నారు.ఇలావుంటే, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి గతంలో 'సామాజిక తెలంగాణ అవసరమని ప్రగల్భాలుపలికి, నేడు మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు లోబడి తన నిర్ణయాన్ని మార్చుకుని సమైక్యాంధ్రకు సై అంటూ ఏకంగా ఆ ఉద్యమంలోనే ప్రత్యక్షంగా మమేకమైపోయారు. ఏదిఏమైనా చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణలో ప్రతికూలంగా ఉన్నా, సీమాంధ్రలో మాత్రం ఆయన వైఖరిపట్ల విశ్వసనీయత మరింత పెరిగినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. కనీసం చిరంజీవి స్పందించి నట్టయినా తమనేత స్పందించడంలేదంటూ సీమాంధ్ర, తెలంగాణ టిడిపి నేతలు లోలోన చంద్రబాబు వైఖరిపై రగిలిపోతున్నారు.

సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలలో దేనికి సై అన్నా భవిష్యత్‌లో రాజకీయంగా నష్టపోతామేమో అన్న భయం చంద్రబాబును తీవ్రంగా వెంటాడటంవల్లే, విభజ న వివాదంపై పార్టీ అధినాయకుడిగా తన నిర్ణయాన్ని ఖరారు చేసుకోలేకపోతు న్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. విభజన వివాదంపై ప్రజల మనో భావాల కు అనుగుణంగా ఏదోఒక నిర్ణయానికి కట్టుబడాలేతప్ప ఈ విధంగా అధై ర్యంతో ఏదీ తేల్చక, ప్రత్యర్ధుల విమర్శలు, ఆరోపణలను భరిస్తూ, దోబూచు లాడ టం పార్టీ భవిష్యత్‌కు మంచిదికాదన్నది పార్టీలో ఒకవర్గం భావిస్తున్నది.

చంద్రబాబు సందిగ్ధవైఖరిపట్ల ప్రజల్లో అనవసరమైన అనుమానాలకు తెరలే స్తుందని, విమర్శకులకు మరింత అవకాశం ఇచ్చినట్టవుతుందని ఇరుప్రాంతాల నేతలు భావిస్తున్నారు. అయితే ఈ వివాదంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తుదినిర్ణయం ప్రకటించిన తర్వాతే టిడిపి తరఫున పార్టీవైఖరిని ఖరారుచేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు మరోపక్క సర్ధిచెబుతుండడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో రెండు వర్గాలను సముదాయించలేక చంద్రబాబు పరిస్థితి 'కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన సామెతగా మారింది.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 'ఓదార్పు' నిజాయితీని గుర్తించారు
 కష్టాలు అధిగమించడమే నా సక్సెస్
 సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
 ఒయులో అసలేం జరిగిందంటే
 జగన్‌కు సోనియా ఝలక్‌
 రాజకీయాలు పూల బాటకాదు, ముళ్లబాట..
 పోలీస్‌ చమత్కారం?
 డాక్టర్‌ గిరీష్‌ సంఘీకి సిఎం..
 పిహెచ్‌డి విద్యార్థులతో పాఠాలు
 కార్యదీక్ష, దృఢ సంకల్పం వైశ్యుల..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com