పాంటె వెద్రా బీచ్, డిసెంబర్ 19 : పిజిఎ టూర్ ప్లేయ ర్‌గా 2009కి టైగర్ వుడ్స్ పేరును శుక్రవారం ఎంపిక చేయడంతో గత 13 ఏళ్ళలో పది సార్లు ఈ గౌరవం అతనికి దక్కినట్లయింది. ఈ అవార్డు ఎంపిక ప్రక్రియలో భాగంగా గత నాలుగు వారాల క్రిందటే ఆటగాళ్లు ఓటింగ్ చేసినా, వివరాలను విడుదల చేయడానికి పిజిఎ తిరస్క రించింది. ఈ ఏడాది ప్రారంభంలో మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్న వుడ్స్ ఆట నుంచి నిరవధిక సెలవును తీసుకోనున్నట్లు గత వారంలో ప్రకటించాడు. తన వివా హ బంధంలోని అవకతవకలను సరిదిద్దుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపాడు.
అన్ని పెద్ద పిజిఎ టూర్ అవార్డులను వుడ్స్ గెలుచుకోవడం ఇది ఎనిమిదవ సారి. లోయస్ట్ అడ్జ్‌స్టడ్ స్కోరింగ్ యావరే జ్‌కు బైరాన్ నెల్సన్ అవార్డును, మనీ టైటిల్‌కు అర్నాల్డ్ పామెర్ అవార్డును, ఏడాది ఆటగానిగా జాక్ నిక్‌లాస్ అవార్డును వుడ్స్ గెలుచుకున్నాడు.
గత ఏడాదిలో ఫెడ్‌ఎ క్స్ కప్, దాని 10 మిలియన్ డాలర్ల బోనస్‌తో సహా అరడజను టోర్నమెంట్లలో వుడ్స్ విజయం సాధించాడు. ఈ సీజన్‌లో ఎటువంటి పెద్ద విజయాన్ని సాధించక పోయినప్పటికీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా వుడ్స్ ఎంపిక కావడం ఇది రెండవ సారి.