| గాయంతో మ్యాథ్యూస్ దూరం |
| ఆది వారం, డిసెంబర్ 20, 2009 , 1:45 [IST] |
 |
|
చెన్నై, డిసెంబర్ 19 : గాయాల కారణంగా శ్రీలంక ఆల్ రౌండర్ అంగెలొ మాథ్యూస్ భారత్‌లోని మిగిలిన వన్డేలలో ఆడకుండా వెనుదిరిగాడు. రెండవ వన్డేలో శుక్రవారం 37 నాటౌట్‌గా నిలిచిన మీడియమ్ పేస్ బౌలర్‌కు కుడి భాగంలో గాయం అయింది. ఆ గాయం నుంచి రికవరీ కావడానికి నాలుగు వారాలు పడుతుందని శ్రీలంక బందం శనివారం తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. మూడవ వన్డే కటక్‌లో సోమవారం ఆడనున్నారు. ఈ టూర్‌లో ఇప్పటికే నలుగురు బౌలర్లు గాయాలతో ఇంటి ముఖం పట్టగా, మాథ్యూస్ స్థానంలో ఆల్ రౌండర్ తిస్సారా పెరెరాను ఆటలో దించనున్నారు.
|
|
|
|
|
|
|