మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

Bharathmatrimony
లాగిన్ | రిజిస్టర్
సిరీస్‌ గెలుపు ముంగిట ఆసీస్‌
ఆది వారం, డిసెంబర్ 20, 2009 , 1:39 [IST]

jansonపెర్త్‌, డిసెంబర్‌ 19 : సొంతగడ్డపై, వెస్టిండీస్‌తో జరగుతున్న టెస్ట్‌ సీరిస్‌ను ఆసీస్‌ 2-0తో కైవసం చేసుకోనుంది. నవంబర్‌ 26న ప్రారంభమైన సిరీస్‌లో భాగంగా బ్రిస్‌బ్యాన్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ 65 పరుగుల తేడాతో విండీస్‌ను ఓడించింది. ఆల్‌రౌండ్‌ ప్రతిభను కనబర్చిన ఆసీస్‌ ఆదే జోరును కొనసాగించి రెండో మ్యాచ్‌ను డ్రాగా ముగించి 1-0 ఆధిక్యాన్ని సాధించింది. గెలుపు ధీమాతో ఉన్న ఆసీస్‌ ఈ నెల 16న పెర్త్‌లో ప్రారంభమైన మూడో మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్‌ వాట్సన్‌ (89), కటిచ్‌ (99), హస్సీ (82), హడిన్‌ (88), నార్త్‌ (68)లు రాణించడంతో 7 వికెట్లు కోల్పోయి 520 పరుగులు సాధించింది.

దఢమైన బౌలింగ్‌ కలిగి ఉన్న ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. భారీ స్కోరును ఛేదించేందుకు బ్యాటింగ్‌ ప్రారంభించిన విండీస్‌కు ఓపెనర్లు గేల్‌ (102), డౌలిన్‌ (55), శర్వాన్‌ (42), నాష్‌ (44)ల జోరుతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు ధాటిగా సమాదానం ఇచ్చింది. 312 పరుగులు చేసింది.అప్పటికే 208 పరుగుల లీడ్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. నాలుగో రోజు మరో 13 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్‌ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌ డునేరియా (82), నాష్‌ (65) మినహా బ్యాట్స్‌మెన్‌ అందరూ విఫలమవ్వడంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది.

నాలుగో రోజు ఆసీస్‌ బౌలర్లు బోలింగర్‌ 2 వికెట్లు పడగొట్టగా జాన్సన్‌ 3, వాట్సన్‌ 2 వికెట్లు తీసుకున్నారు. మెక్‌ కీ, హౌరిట్జ్‌లు చెరో వికెట్‌ పడగొట్టడంతో వెస్టిండిస్‌ 9 వికెట్లు కోల్పోయింది.అయితే విండీస్‌కు విజయం దక్కాలంటే 51 పరుగులు చేయాల్సిఉండగా, ఆసీస్‌కు సిరీస్‌ విజయం 1 వికెట్‌ దూరలో ఉంది.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 ఒత్తిడిలో పాక్‌ క్రికెట్‌ బోర్డు
 ఆటగాళ్ళ గదులనుంచి పెద్దఎత్తున..
 ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
 క్వార్టర్స్‌లో సైనా
 ఫైనల్‌లో భారత్‌
 ప్రపంచ చాంపియన్‌షిప్‌..
 లంకపై ప్రతీకారానికి సిద్ధమైన..
 వీరూకు శ్రీలంక బోర్డు క్షమాపణ
 గెలుపు దక్కింది
 భారత్‌కు గెలుపు కావాలి
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com