మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

Bharathmatrimony
లాగిన్ | రిజిస్టర్
ధోనీకి రెండు వన్డేల నిషేధం
ఆది వారం, డిసెంబర్ 20, 2009 , 1:30 [IST]

dhoniఇషాంత్‌, కార్తీక్‌లకు చోటు  
సెహ్వాగ్‌కు కెప్టెన్‌ బాధ్యతలు
నాగ్‌పూర్‌, డిసెంబర్‌ 19 :
నాగ్‌పూర్‌ వన్డేలో కెప్టెన్‌ ధోనీ సెంచరీ సాధించినప్పటికీ, నిర్నీత సమయం లోగా ఓవర్లను బౌల్‌ చేయడంలో విఫలం చెందా డు. శ్రీలంకతో నాగ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌ రేటింగ్‌ కారణంగా భారత కెప్టెన్‌ ధోనీకి రెండు వన్డేల నిషేధం విధించారు. భారత్‌ మూడు ఓవర్లు తక్కువగా బౌల్‌ చేయడంతో తీవ్రమైన ఓవర్‌ రేట్‌ నేరంగా పరిగణించే కేటగిరిలోకి వచ్చిన కార ణంగా సాధారణంగా విధించే జరిమానాల కన్నా తీవ్రమైన జరిమాన విధించారు. వెంటనే రెండు అంతర్జాతీయ వన్డేల నిషేధం అమలులోకి రావడం తో కటక్‌, కోల్‌కతాలలో జరిగే 3,4వ వన్డేలలో ధో నీ అందుబాటులో ఉండడం లేదు. ఢిల్లీలో జరిగే ఆఖరి వన్డేలో ఆడే అవకాశం ఉంది.

ఈరెండు మ్యాచ్‌లకు ధోని స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్‌ కెప్టెన్‌ గా వ్యవహరిస్తారు. నిర్ణీత సమయంలోగా వన్డేల్లో రెండు ఓవర్లు, టెస్ట్‌ మ్యాచ్‌ల్లో అయిదు ఓవర్లు తక్కువగా వేయడాన్ని ీమైనర్‌ నేరంగా పరిగణించి, 12 నెలల్లో మరల రిపిట్‌ అయిన నేరానికి మాత్రమే నిషేధం విధిస్తారు. కానీ భారత్‌ శుక్రవారం రాత్రి నిర్ణీత సమయం కన్నా 45 నిముషాలు ఆలస్యంగా 50 ఓవర్లను పూర్తి చేసింది. ఈ పరిస్థితుల్లో రిఫరీ జెఫ్‌ క్రొవే చేసేదేమీ లేక నిషేధాన్ని విధించారు. వచ్చే 12 నెలల్లో భారత్‌ గనుక మరల ఇటువంటి సీరియస్‌ ఓవర్‌ రేట్‌ నేరానికి పాల్పడితే, ధోనీకి రెండు నుంచి ఎనిమిది వన్డేలు, లేదా ఒకటి నుంచి నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల నిషేధం విధించవచ్చు. ధోనీ కి ఈ విషయం ముందుగానే తెలియజేసినట్లు బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ధవీకరించారు. ఈ స్లో ఓవర్‌ తప్పిదానికి గాను మిగిలిన భారత ఆటగాళ్ళకు మ్యాచ్‌ ఫీజులో 40 శాతం కోత విధిం చనున్నారు.

సాధారణంగా మొదటి రెండు ఓవర్లకు 10 శాతం చొప్పున, తరువాతి ప్రతి ఓవర్‌కు 20 శాతం చొప్పున జరిమానా విధిస్తారు. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ధోనీపై రెండు వన్డేల నిషేధాన్ని మ్యాచ్‌ రిఫరీ విధించారన్న సమాచారం తమకు అందిందని, వివరాలు చూసిన తరువాత వ్యాఖ్యా నించగలమని బిసిసిఐ ప్రధాన పాలనాధికారి రత్నాకర్‌ షెట్టి చెప్పారు. ఈ పర్యటనలో ముందు గా, మొహిలీలోని రెండో ట్వంటీ 20లో శ్రీలంక రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో కుమార్‌ సంగక్కర నిషేధానికి దగ్గరగా వచ్చాడు. దానికి గాను సంగక్కరకు మ్యాచ్‌ ఫీజులో 40 శాతం, మిగిలిన జట్ట సభ్యులక ప్రతి ఒక్కరికి 20 శాతం చొప్పున జరిమానాతో సరిపెట్టామని క్రొవే చెప్పారు.తన బందం ఓవర్‌ రేటు గురించి కుమార్‌కు ఫీల్డులో ఉన్న అంపైర్లు మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు హెచ్చరించారని క్రొవె అన్నారు. కొత్త నియమ నిబంధనలను అనుసరించి వచ్చే 12 నెలల్లో శ్రీలం క ఇటువంటి మైనర్‌ నేరాన్ని రిపిట్‌ చేస్తే నిషేధం తప్పదని, మూడో సారి జరిగితే గేమ్‌ నుంచి సంగ క్కరను బయటకు పంపుతారని ఆయన చెప్పారు.

eshanth and karthikఇషాంత్‌, కార్తీక్‌లకు జట్టులో స్థానం
శ్రీలంకతో జరిగే మూడు, నాల్గో వన్డేలకు గాను భారత జట్టులోకి ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ, వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తీక్‌లను చేర్చారు. నాగ్‌పూర్‌ లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగాతో రెండు వన్డేల నిషే ధం గురైన ధోనీ, స్వైన్‌ఫూతో భాద పడుతున్న శ్రీశాంత్‌లు ఈ మ్యాచ్‌ల్లో ఆడలేకపోవడంతో ఈ మార్పులు జరిగాయి. కటక్‌, కోల్‌కతాలలో జరిగే మ్యాచ్‌ లలో ధోనీ స్థానంలో కార్తీక్‌ ఆడనుండగా, వీరేంద్ర సెహ్వాగ్‌ కెప్టెన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారు.వేలికి గాయం, అనారోగ్యం కారణంగా మొదటి రెండు వన్డేలలో ఆడని యువరాజ్‌ సింగ్‌ మళ్ళీ టీమ్‌లో చేరాడు.

ప్రస్తుత భారత జట్టు (అంచనా):
వీరేంద్ర సెహ్వాగ్‌ (కెప్టెన్‌), గౌతం గంభీర్‌, సచిన్‌ టెండూల్కర్‌, సురేష్‌ రైనా, దినేష్‌ కార్తీక్‌ (వికెట్‌ కీపర్‌), విరాట్‌ కొహ్లీ, రవీంద్ర జడేజా, యువరాజ్‌ సింగ్‌, ఇషాంత్‌ శర్మ, జహీర్‌ ఖాన్‌, హర్భజన్‌ సింగ్‌, ప్రవీణ్‌ కుమార్‌, ఆశిష్‌ నెహ్రా, సుదీప్‌ త్యాగి, ప్రగ్యాణ్‌ ఒజా.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 ఒత్తిడిలో పాక్‌ క్రికెట్‌ బోర్డు
 ఆటగాళ్ళ గదులనుంచి పెద్దఎత్తున..
 ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
 క్వార్టర్స్‌లో సైనా
 ఫైనల్‌లో భారత్‌
 ప్రపంచ చాంపియన్‌షిప్‌..
 లంకపై ప్రతీకారానికి సిద్ధమైన..
 వీరూకు శ్రీలంక బోర్డు క్షమాపణ
 గెలుపు దక్కింది
 భారత్‌కు గెలుపు కావాలి
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com