మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
పెరిగిన సిమెంట్‌ ధరలు
శని వారం, డిసెంబర్ 19, 2009 , 11:52 [IST]

cementహైదరాబాద్‌, డిసెంబర్‌ 19: రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్‌ ధరలు పెరిగేయి. ముఖ్యంగా గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం ఒకసారి, తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమాలు జరగడం వల్ల అన్ని చోట్ల బంద్‌ పాటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్‌ కొరత ఏర్పడటంతో సిమెంట్‌ ధరలకు రెక్కలు వచ్చాయి. గత వారం రోజుల క్రితం బస్తా ధర రూ.128 పలుకగా అది ఇప్పుడు రూ.145 నుంచి రూ.150 పలుకుతుంది.రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఇలాగే కొనసాగితే మళ్ళీ రూ.200పైకి చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయబడు తున్నారు.

అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా గత కొంత కాలంగా స్తబ్దంగా ఉన్నా రియల్‌ ఎస్టేట్‌ వంటి రంగాలు ఇప్పుడిప్పుడే కొలుకోవడంతో సిమెంట్‌కు గిరాకీ పెరిగిపోయింది. గత కొన్ని రోజులుగా పతనం అవుతూ వచ్చిన సిమెంట్‌ ధరలు మళ్ళీ పెరగడం ప్రారంభించాయి. ఒకానొక దశలో సిమెంట్‌ ధరలు రూ.240గా అమ్ముడై రికార్డు సష్టింది.అయితే ఆ తర్వాత అన్ని సిమెంట్‌ కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచుకోవడంతో తదితర పరిణామాలతో సిమెంట్‌కు డిమాండ్‌ తగ్గిపోవడంతో ధరలు పతనం అయ్యాయి.ఇండియా ఆర్థిక వద్దిరేటు పెరగడంతో రియల్‌ ఎస్టేట్‌ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గత వారం రోజులుగా లారీలు ఎక్కడి కక్కడే ఆగిపోవడంతో డిమాండ్‌ పెరిగి సిమెంట్‌ ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయబడు తున్నారు. సిమెంట్‌ ధరలు మరింత పెరిగే సూచనలు కనిపించడంతో అవసరం లేకున్న కొంత మంది వినియోగదారులు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఏమో ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని వారు చెప్పుతున్నారు.

తెలంగాణ వస్తుందన వార్తలు రావడంతో హైదరాబాద్‌ పరిసరాల ప్రాంతాలలో రియల్‌ ఎస్టేట్‌ ధరలు భారీగా పడిపోయాయి. దీంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ కట్టడాలు కూడా నిలిచిపోనున్నాయి. గతంలో ఒక్కొక్క ప్లాట్‌కు ఆరలక్షకు పైగా కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిన ప్రజలు  వెనుకడుగు వేసే అవకాశం ఉంది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ ధరలు పతనం అయ్యే అవకాశం ఉంది. గత నవంబర్‌తో పోల్చుకుంటే ఈ నవంబర్‌లో సిమెంట్‌ వినియోగం  15శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. ఇటు అమ్మకాలు, అటు ధరలు పెరగడంతో కంపెనీలు ఊపిరి పీల్చుకుంటు న్నాయి. రవాణ సరఫరా మెరుగైతే మళ్ళీ ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 కొబ్బరి మార్కెట్‌కు ముందుంది పండగ
 కొల్హాపూర్‌లో గేట్‌వే హోటల్
 మెక్‌డోవెల్‌ హోల్డింగ్స్‌ ఫలితాలు
 రేమండ్‌ వీల్‌ కొత్త వాచ్‌
 బేకర్స్‌ ఇన్‌ నుంచి ఉత్పత్తులు
 బంగారంలో ప్లాటినం లోహాల ఉనికి
 వ్యవసాయరంగానికి భారీ రుణాలు
 ఎయిర్‌ ఇండియాపై ఫిర్యాదు
 పెరిగిన టాటా మోటార్స్‌ అమ్మకాలు
 పెరిగిన ఫిన్‌ ఎయిర్‌ టర్నోవర్‌
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com