మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
పబ్లిక్‌ ఇష్యూల వెల్లువ
శని వారం, డిసెంబర్ 19, 2009 , 11:49 [IST]

ipoముంబయి డిసెంబరు 19:- భారతీయ స్టాక్‌ మార్కెట్లల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా నిధులు ప్రవహింప చేయడం వల్ల సెకండరీ మార్కెట్లో లావాదేవీలు బాగా పెరుగుతున్నాయి. 2009 సంవత్సరంలో ఇప్పటి వరకు సెకండరీ మార్కెట్లో 16 బిలియన్‌ డాలర్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులు వచ్చినట్లు అంచనా. దీనితో పబ్లిక్‌ ఇష్యూలు జారీ చేసే కంపెనీలు, మర్చెంట్‌ బ్యాంకర్లు హాడావిడి చేస్తున్నారు.రానున్న ఆరు నుంచి ఎనిమిది నెలల్లో కంపెనీలు 30వేల కోట్ల రూపాయల నగదును పబ్లిక్‌ ఇష్యూల ద్వారా సమీకరించవచ్చునని తెలుస్తు న్నది.

చిన్న చిన్న కంపెనీలు కూడా రూ.50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల నిధులను సమీకరిం చడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. 2009 సంవత్సరంలో ఇప్పటి వరకు 20కిపైగా కంపెనీలు 19వేల కోట్లను ఐపిఓల ద్వారా సమీకరించాయి.ఇందులో ప్రధానంగా విద్యుత్‌ కంపెనీలు, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు ఉన్నాయి. ఈ నిధులు కాకుండా అర్హతగల సంస్థల వల్ల తమ షేర్లను ఉంచి 43వేల కోట్ల రూపాయలను ఈ కంపెనీలు సేకరించే ప్రయత్నంలో ఉన్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారతీయ షేర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడటం వల్ల కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలు జారీ చేయడంలో ఆసక్తి చూపుతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వె స్టర్లు ఇండియా, చైనా మార్కెట్లలో భారీగా నిధు లను ప్రవహింప చేసే అవకాశం ఉంది.

అయితే కంపెనీల షేర్లకు విలువ కట్టేటప్పుడు మర్చెంట్‌ బ్యాంకర్లు జాగ్రత్తగా వహిస్తున్నారు. జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ, గోద్రెజ్‌ ప్రాపర్టిస్‌ వంటి కంపెనీల షేర్ల మార్కెట్‌ ధరలు ఇష్యూ ధర కంటే తక్కువగా ఉండటం, మర్చెంట్‌ బ్యాంకర్లను ఆందోళన పరుస్తున్నది. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ ఐదువేలకోట్ల రూపాయల నిధులను సమీకరించడానికి కసరత్తు చేస్తున్నది. ఎమ్‌ఆర్‌ఎమ్‌జిఎఫ్‌ వంటి కంపెనీలు కూడా సరైన సమయంలో మార్కెట్లో ప్రవేశిం చాలని ఆశిస్తున్నాయి. దాదాపు 40 కంపెనీలు తమ ప్రాస్పెక్టర్స్‌ను సమర్పించి సెబి అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి.

ఇందులో సహరా ప్రైమ్‌, స్టెరిలైట్‌ ఎనర్జి, లోధాడెవలపర్స్‌, జెపి ఇన్‌ఫ్రాటెక్‌, డిబి రియాల్టీ, యాంబియన్స్‌, ఐఎల్‌అండ్‌ ఎఫ్‌ఎస్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ నెట్‌వర్క్‌, హతావేకేబుల్‌, డేటాకామ్‌, గ్లెన్మార్క్‌ జెనరిక్స్‌ వంటి కంపెనీలు ఉన్నాయి. 2009లో సమీకరించిన 19వేల కోట్ల నిధుల సమీకరణలో రూ.13,500 కోట్లు పవర్‌ కంపెనీలకు చెందాయి. ఎన్‌హెచ్‌పిసి రూ.6,038 కోట్లు సమీకరించగా అదాని పవర్‌ రూ.3,016 కోట్లు, జెఎస్‌డబ్ల్యుఎనర్జీ రూ. 2,700 కోట్లు సమీకరించాయి.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 కొబ్బరి మార్కెట్‌కు ముందుంది పండగ
 కొల్హాపూర్‌లో గేట్‌వే హోటల్
 మెక్‌డోవెల్‌ హోల్డింగ్స్‌ ఫలితాలు
 రేమండ్‌ వీల్‌ కొత్త వాచ్‌
 బేకర్స్‌ ఇన్‌ నుంచి ఉత్పత్తులు
 బంగారంలో ప్లాటినం లోహాల ఉనికి
 వ్యవసాయరంగానికి భారీ రుణాలు
 ఎయిర్‌ ఇండియాపై ఫిర్యాదు
 పెరిగిన టాటా మోటార్స్‌ అమ్మకాలు
 పెరిగిన ఫిన్‌ ఎయిర్‌ టర్నోవర్‌
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com