| సస్పెన్స్, థ్రిల్లర్‌గా గద్దె సింధూర చిత్రం |
| శని వారం, డిసెంబర్ 19, 2009 , 11:28 [IST] |
 |
|
గద్దె సింధూర ప్రధాన పాత్రలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్‌గా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై నగేష్ నారదాశి దర్శకత్వంలో కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నగేష్ నారదాశి మాట్లాడుతూ ' ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ను తిరుపతి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నాం.
సస్పెన్స్, థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొంద ుతోంది.ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మధు.ఎ. నాయుడు, సంగీతం: సాయికార్తీక్, సమర్పణ: జె.యాదగిరి, సహ నిర్మాతలు: ప్రసాద్, రాజు, విష్ణువర్థన్‌రాజు, నిర్మాత: కిరణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నగేష్ నారదాశి.
|
|
|
|
|
|
|