పోసాని కృష్ణమురళి హీరోగా స్వీయదర్శకత్వంలో వీరభద్ర ప్రొడక్షన్స్ పతాకంపై నల్లం పద్మజ నిర్మిస్తున్న సందేశాత్మక చిత్రం 'జెంటిల్‌మెన్. ఆర్తి అగర్వాల్ కథానాయిక. ఈ చిత్రాన్ని 25న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'పెళ్లయిన కొత్తలో ఎంతో అన్యోన్యంగా ప్రేమానురాగాలలతో వ్ఞండే దంపతులు రెండు సంవత్సరాల తరువాత ఆ అన్యోన్యత ఎందుకు వ్ఞండదు? ఏ కారణాల చేత వారి ఆలోచనల్లో మార్పు వస్తుంది? ఇలాంటి సున్నిత అంశాల్ని ఈ చిత్రంలో చర్చిస్తున్నాం. ఈ నెల 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.
సమర్పకులు నల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ 'ఈ చిత్రంలో వైవాహిక జీవీతం గురించి, మానవీయ సంబంధాల గురించి పోసాని కృష్ణమురళి అద్భుతంగా ఆవిష్కరించాడు. లండన్‌కు చెందిన లూయిస్ రెండో కథానాయికగా నటిస్తోంది అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యు.మల్లిక్ శర్మ, కెమెరా: వీణా సి ఆనంద్, నిర్మాత: నల్లం పద్మజ, దర్శకత్వం: పోసాని కృష్ణమురళి.